సంతకం...

ఎప్పటి నుండో ఏదో ఒకటి రాయాలని కోరిక.కాని ఇప్పటికింకా అది తీరలేదు. మనసులోని భావాలకు అక్షర రూపం ఇద్దామనుకునేసరికి కెరటంలా మరో ఆలోచన. పోనీ వచ్చిన ఆలోచనకి కొంచం హంగులు దిద్ది ప్రాణం పొద్దామనుకునేసరికి మరో కెరటం. అసలింతకి ఏమి రాయలానుకుంటున్నావని అడిగితే ఏమని చెప్పను ? కథా ? కాదు…కవిత్వమా ? అస్సలు కాదు…ఏంటొ సరిగ్గా నాకే తెలీదు…. నాకే కాదు నా అలోచనలకి కూడ స్థిరం తక్కువనుకుంటా…అందుకే ఒక దాని వెంట మరొకటి ప్రవాహంలా ..చివరికి ఎవరైనా ఏమి రాసావని అదిగితే కలగాపులగమైన నా మెదడులోని అలోచనలకి చిహ్నంగా ఒక తెల్ల కాగితం..కాగితం చివరన ఇలా అందమైన నా సంతకం.
--ఆదిత్య

Comments

Anonymous said…
This one is far better man.. This resembles the common man.. but only those succeed who think patiently & relentlessly until they achieve what they think... There is not difference between winners & losers.. Winners never quit.. quitters never win..

----Venu.
C. Narayana Rao said…
O'Henry కథల్లోలా మీకు 'కొసమెరుపులు ' ఇష్టమనుకొంటా! మీ రచనలు కొసమెరుపుతో అంతమౌతున్నాయి.welcome to the O'Henry in the making.
cbrao said…
కధనం, ముగింపు రెండూ బాగున్నాయి.కాని బ్లాగుగా చూస్తే మూదు కధల్లో పోలిక కనపడుతుంది.ముగింపులో మెలిక తీసుకురావాలనే ప్రయత్నం. కొత్త పోస్ట్ లో వైవిధ్యం కొసం భిన్నంగా రాయండి.
హాయ్ ఆది ! ఇది చాలా బెటర్. బెటర్ కాదు నా ఉద్దేశంలో బెస్ట్. నారాయణరావు గారు చెప్పినట్లు కొసమెరుపులు నీకు ఇష్టమనే అర్ధమవుతోంది. ఈ విధానాన్నే కొనసాగించు. బాగుంది. Continue.
Anonymous said…
It's better.The other 2 seems to be your own experiences rather than creation.Good Job...go ahead

Popular posts from this blog

ఫొటో

ఎవరు నువ్వు ?

మొదటి అందం