ఎవరు నువ్వు ?
“శైలేష్‌ని ఎందుకు చంపావు ? ”
“నేను చంపలేదు .”
“మరెవరు చంపారు ?..........................అడిగేది నిన్నే.. మాట్లాడవేం ? …….నాకు తెలుసు నువ్వే చంపావు .”
“చంపింది నేను కాదంటే వినవేం ?”
“నువ్వు కాకపోతే నీలోని రచయిత. ఇద్దరు ఒక్కటే కదా. ........”
“అన్నీ తెలిసి కూడా నన్ను ప్రశ్నిస్తావేం ?”
“ఆంటే నువ్వు రచయితవి కాదా ?”
“కాదు. నేను రచయితని కాదు.రచన నా వృత్తి అంతకన్నా కాదు .”
“వృత్తి కాకపోతే ప్రవృత్తి........పాపం శైలేష్....నిర్దాక్షిణ్యంగా బలయిపోయాడు .”
..“నా గురించి అన్నీ తెలిసి కూడా నన్నెందుకు విసిగిస్తావ్ ? వెళ్ళు అవతలికి. అయిన శైలెష్ నా కథలో సెంట్రల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని చంపితేనే ప్రేక్షకులు ఉత్కంఠగా చదివేది .”
“హన్ నాకు తెలుసు..మొన్నటికి మొన్న ….నీ నవలలో హీరోయిన్‌ని అందుకేగా చంపేసావు.? ఆ నవలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు అతితక్కువ కాలంలో ఎక్కువ కాపీలు అమ్ముడుపోయింది ఆ నవలే కదా…అయినా ప్రేక్షకుల్లో ఉత్కంఠ లేపటం కోసం ఒక మనిషిని చంపేస్తావా ?.కీర్తి,డబ్బు సంపాదించటం కోసం ఖూనీలు కూడా చేస్తావనుకోలేదు. రచయిత అంటే తన రచనలతో పదిమందికి ఙ్ఞానాన్ని పంచాలి కాని ఇలా ఖూనీలు చెయ్యకూడదు .”
“నేను చంపింది శైలేష్ అనే ఒక క్యారెక్టర్ని మాత్రమే. నిజంగా నేనేమి ఖూనీకోరుని,హంతకుణ్ణి కాదు. అసలు నా గురించి ఏమి తెలుసు నీకు ? నేను నా కథలోని సెంట్రల్ క్యారెక్టర్ని ఆఖరి పేజిలోనే చంపుతాను. ఎందుకంటే నా నవల మూసిన వెంటనే ప్రేక్షకుడికి ఆ క్యారెక్తర్ ఒక చెరగని ముద్ర వెయ్యాలి. పైగా సైకలాజికల్గా ప్రతీ పాఠకుడు తనని తాను నవలలోని సెంట్రల్ క్యారెక్టర్కి అన్వయించుకుంటాడు. దానికి తోడు నా నవల గురించి పదిమందికీ చెబుతాడు .”
“హన్ నాకు తెలుసు. నువ్వు నీ నవల చదివిన పాఠకుడి చేతనే పబ్లిసిటి ఇప్పిస్తావు .”
“ఏ రచయిత అయినా కోరుకునేది అదే. నిజం చెప్పాలంటే రచయిత తన పాఠకుడి చేత అలా చేయించగలిగాడు అంటే ఒక రచయితగా విజయం సాధించినట్టే. నేను కూడా రచయితగా కీర్తి కోరుకుంటాను. కీర్తి వస్తే డబ్బు ఆటోమేటిగ్గా అదే వస్తుంది.”
"మ్మ్ అంతా బాగానే వుంది....కానీ నీతో నేను ఏకీభవించను....కథలో కథానాయకుణ్ణి కానీ కథలోని సెంట్రల్ క్యారెక్టర్ని కానీ చంపితేనే పాఠకుడిలో ఉత్కంఠ వస్తుంది అంటే నేను నమ్మను. నా గురించి ఏం తెలుసు ? అని అడిగావు చూడు. నీ గురించి నాకన్నా ఎక్కువగా యెవ్వరికీ తెలీదు. "
" నాకు నీ నమ్మకంతో పని లేదు...ఏంటి ఏమన్నావు ? నా గురించి తెలుసా ? ఏది ఏమి తెలుసో చెప్పు చూద్దాం ?"
"తెలుసు....నీ గురించి అంతా తెలుసు..కాకపోతే నీలో వున్న రచయిత గురించే తెలీదు...అది తెలుసుకుందామనే ఈ ప్రయత్నం"
"తెలుసా ? అంతా తెలుసా ?? అసలు ఎవరు నువ్వు ?"
"నీ అంతర్ముఖాన్ని"

Comments
Vishy
Bye,
Kiran
anyways, I liked the style and usage of words. Keep writing.