Posts

Showing posts from July, 2006

సంతకం...

ఎప్పటి నుండో ఏదో ఒకటి రాయాలని కోరిక.కాని ఇప్పటికింకా అది తీరలేదు. మనసులోని భావాలకు అక్షర రూపం ఇద్దామనుకునేసరికి కెరటంలా మరో ఆలోచన. పోనీ వచ్చిన ఆలోచనకి కొంచం హంగులు దిద్ది ప్రాణం పొద్దామనుకునేసరికి మరో కెరటం. అసలింతకి ఏమి రాయలానుకుంటున్నావని అడిగితే ఏమని చెప్పను ? కథా ? కాదు…కవిత్వమా ? అస్సలు కాదు…ఏంటొ సరిగ్గా నాకే తెలీదు…. నాకే కాదు నా అలోచనలకి కూడ స్థిరం తక్కువనుకుంటా…అందుకే ఒక దాని వెంట మరొకటి ప్రవాహంలా ..చివరికి ఎవరైనా ఏమి రాసావని అదిగితే కలగాపులగమైన నా మెదడులోని అలోచనలకి చిహ్నంగా ఒక తెల్ల కాగితం..కాగితం చివరన ఇలా అందమైన నా సంతకం. --ఆదిత్య

ఎవరు నువ్వు ?

“శైలేష్‌ని ఎందుకు చంపావు ? ” “నేను చంపలేదు .” “మరెవరు చంపారు ?..........................అడిగేది నిన్నే.. మాట్లాడవేం ? …….నాకు తెలుసు నువ్వే చంపావు .” “చంపింది నేను కాదంటే వినవేం ?” “నువ్వు కాకపోతే నీలోని రచయిత. ఇద్దరు ఒక్కటే కదా. ........” “అన్నీ తెలిసి కూడా నన్ను ప్రశ్నిస్తావేం ?” “ఆంటే నువ్వు రచయితవి కాదా ?” “కాదు. నేను రచయితని కాదు.రచన నా వృత్తి అంతకన్నా కాదు .” “వృత్తి కాకపోతే ప్రవృత్తి........పాపం శైలేష్....నిర్దాక్షిణ్యంగా బలయిపోయాడు .” ..“నా గురించి అన్నీ తెలిసి కూడా నన్నెందుకు విసిగిస్తావ్ ? వెళ్ళు అవతలికి. అయిన శైలెష్ నా కథలో సెంట్రల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని చంపితేనే ప్రేక్షకులు ఉత్కంఠగా చదివేది .” “హన్ నాకు తెలుసు..మొన్నటికి మొన్న ….నీ నవలలో హీరోయిన్‌ని అందుకేగా చంపేసావు.? ఆ నవలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు అతితక్కువ కాలంలో ఎక్కువ కాపీలు అమ్ముడుపోయింది ఆ నవలే కదా…అయినా ప్రేక్షకుల్లో ఉత్కంఠ లేపటం కోసం ఒక మనిషిని చంపేస్తావా ?.కీర్తి,డబ్బు సంపాదించటం కోసం ఖూనీలు కూడా చేస్తావనుకోలేదు. రచయిత అంటే తన రచనలతో పదిమందికి ఙ్ఞానాన్ని పంచాలి కాని ఇలా ఖూనీలు చెయ్యకూడ