హతవిధీ !!!

చెన్నై లొ జాబ్ చెసిన రెండున్నర సంవత్సరాల తరవాత మొదటి సారిగా ఇంటెర్నేషనల్ ఫ్లైట్ ఎక్కే అవకాసం వచ్చింది. చెన్నై నుండి ముంబై వరకు జెట్ ఏర్వేస్, ముంబై నుంది జొహన్నెసుబుర్గ్ వరకు సౌత్ ఆఫ్రికన్ ఏర్వేస్ లొ ప్రయాణం.
మా కంపనీ నుండి క్లయింట్ కి వర్క్ చెయ్యటం కొసం సౌథ్ ఆఫ్రిక వెళ్లిన రొజులవి. మా కంపనీ నుండి అక్కడకి వెల్లిన వాళ్లకి, హౌస్ అండ్ కార్ ఇస్తుంది మా కంపనీ. బ్యాచిలర్స్ అయితె ఇద్దరు ఒక హౌస్ ని షేర్ చేసుకొవాలి. కార్ కూడా అంతె. ఇద్దరికి కలిపి ఒక కార్ ఇస్తారు. సాధరణంగా ఒకే ప్రాజెక్టు లొ వుండే ఇద్దరు బ్యాచిలర్స్ షేర్ చెసుకొవలి. కాని, కార్ డ్రైవ్ చెయ్యాలంటె, ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఇండియన్ పాస్ పోర్ట్ వుండాలి. సౌత్ అఫ్రికన్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ వున్నా సరె, మా కంపనీ అపాంట్ చేసిన ట్రైనర్ సర్టిఫై చేసిన తరవాతే, కార్ కీస్ మన చేతికి వస్తాయి. ఎంత డ్రైవింగ్ వచ్చినా ఆ ట్రైనర్ సెర్టిఫై చెయ్యకపోతె కంపనీ కార్ లొ మన పెరు మాత్రం వుండదు. కార్ ఇన్సురెన్స్ లొ కూడ మన పేరు అప్పుడె ఆడ్ చెస్తారు. ఆ ట్రైనర్ చాల స్ట్రిక్టు. వాడు చెప్పి వెళ్లాలి, చెప్పులేసుకుని వెళ్లాలి అనే టైపు. మా ట్రైనర్ పేరు "మార్టిన్". పొట్తిగా, తెల్లగా, కళ్లజోడు పెట్టుకుని  వుంటాడు. చూడటానికి పొట్తిగా వున్నా, చాల గట్టోడు.

వాడితొ ఫొను మాట్లాడి మా అపార్టుమెంట్ అడ్రెస్ చెప్పి డ్రైవింగ్ టెస్ట్ కి అపాయింట్ మెంట్ తీసుకున్నాను. శనివారం మార్నింగ్ 8:30 కి ఇచ్చాడు అపాయింట్ మెంట్. చెప్పాను కదా వాడు చాల స్ట్రిక్ట్ అని. చెప్పిన టైము కి వెళ్లకపోతె వెళ్లిపొతాడు. మొదటి రొజు కదా అని కరక్టుగా 8:30 కి వెల్తే, అప్పటికె వాడు వచ్చి వున్నాడు. వాడు డ్రైవర్ సీటు లొ కాకుండా పక్క సీటు లొ కుర్చుని వున్నాడు. డౌట్ వచింది. వీడు నిజంగానే డ్రైవరా లేక ఓనరా అని. కాని నా అనుమానం తప్పు. వాడు డ్రైవరే. వాడు నా డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఇండియన్ పాస్ పోర్ట్ చూపించమన్నాడు. నా తప్పు లెకుండ వాదికి ముందే చెప్పను. నాకు పెద్దగా (అస్సలు) డ్రైవింగ్ ఎక్ష్పీరియన్సు లేదు అని. వాడు పరవాలేదన్నట్టు ఏమి మాట్లడలెదు కూడ. వాడు సరిగ్గా విన్నడొ లేదొ అని నేను ఇక్కడకి వచ్చే ముందే ఒక వన్ వీక్ డ్రైవ్ చెసానని చెప్పాను. అయినా వాడు ఏమి మాట్లడలేదు. డ్రైవింగ్ లైసెన్స్ నంబరు రాసుకుని, నాకు ఇచ్చేసాడు. నేను నా పుర్సు లొ పెట్టుకుని 'ఇక వెల్దామా అన్నట్టు చూసాను వాడి వైపు. వాడు 'Lets Go' అన్నాడు.

నేను కారు డోర్ ఒపెన్ చేసి డ్రైవింగ్ సీటు లొ కూర్చున్నాను. సీటు బెల్టు కూడా పెట్తుకున్నానండోయ్ రూల్సు బాగా తెలుసు అని చెప్పటానికి. కారు ఏలా స్టార్టు చెయ్యాలొ తెలీలేదు. ఛాన్స్ తీసుకుని క్లచ్ నొక్కి కీ తిప్పాను. స్టార్ట్ అయ్యింది. కారు తొ పాటు మార్టిన్ గాడి టార్చర్ కూడ. కారు గేర్ మీద చూస్తె, గేర్ డైరెక్షన్స్ వున్నాయి. పరావాలెదు మేనేజు చెయ్యొచ్చు అనిపించింది. వాడు "Look Straight","Little bit of Patrol", Go  అన్నాడు. వాడు అన్న ఆ రెండోది నాకు అర్ధం కాలేదు. సర్లే ఎదయితే ఎంటి లె అనుకుని, క్లచ్ నొక్కి, గేర్ వెసి, ఆక్సెల్రేటర్ నొక్కి, క్లచ్ వొదిలాను. అంతే...యుద్దం లొ గుర్రం ముందుకి దూకినట్టు కార్ ఒక జుంప్ జుంపింది. కారు ఆగిపొయింది. మార్టిన్ మాత్రం వాడి సేటు లోంచి కొంచం ముందుకు తుళ్లి పడ్డాడు. కార్ తొ పాటె వీడి గుండె కూడా ఆగిపోయిందనుకున్నాను. ఆప్పుడు అనిపించింది. మనిషిని ఇలా కూడా చంపెయ్యొచ్చు అని. చాల ఈజి కదా.! కాని వాడు చావలేదు. నన్ను చంపాలి కదా వాడు. (చెప్పాను కదా స్ట్రిక్ట్  అని ). నా వైపు చూసాడు. నేను " Sorry man ! It's been a long time that I drove a car" అని సమర్ధించుకుని మళ్లి స్టార్ట్ చేసాను. ఈ సారి మాత్రం కారు ఆగకుండా జాగ్రత్త పడ్దాను. మన స్తీరింగ్ హండ్లింగ్ చూసి వాడికి నేను డ్రైవింగ్ లొ ఏ లెవెల్ లొ వున్నానొ అర్ధమయింది.. వాడు స్టీరింగ్ కంట్రోల్ చెయ్యటం మొదలు పెట్టాడు. ఒక 10 నిమషాల తరవత మా అపార్ట్మెంట్ దగ్గర స్టాప్ చెయ్యమన్నాడు. తరవాత వాడు ఒక స్లిప్ మీద ఏదో రాసి ఇచ్చాడు. ప్రతి క్లాస్  తరావాత వాడు అందరికి ఇలా స్లిప్ ఇస్తాడు. చూస్తే వాడి కామెంట్స్ అన్న మాట. ఒక్క మాటలో చెప్పడు వాడు నా డ్రైవింగ్ గురించి "Very New to driving.  No steering control " అని రాసాడు.


మళ్లి ఒక 2 డేస్ తరవాత అపాయింట్మెంట్ ఇచాడు. నేను మా ఆఫీస్ అడ్రెస్ చెప్పి నన్ను పిక్ చెసుకోమన్నాను. ఆ తరవత ఒక రెండు క్లాసుల్లొ కొంచం స్టీరింగ్ కంట్రోల్ చెప్పాడు. ఈ రెండు క్లాసుల్లొ నాకు అర్ధమయ్యిందేంటి అంటె వాడు 'Break' అన్నప్పుడు స్పీడ్ కంట్రోల్ చెయ్యటానికి బ్రేక్ నొక్కాలి అని...'స్టాప్' అంటె , కారు ని ఆపమని అని అర్ధమయ్యింది. మొదట వాడు 'బ్రేక్' అని చెప్పిన కాని నేను 'స్టాప్' చెసేసెవాడిని. ఆ తరవాత అర్ధమయ్యింది రెండూ వేరు వేరు అని. వాడితొ డ్రైవింగ్ class అంటె భయం వేసేది. తప్పు చేస్తె తిట్టెసే వాడు.

ఆ రొజు గురువారం అనుకుంట, సాయి బాబా కి దండం పెట్టి మరీ వెళ్లాను డ్రైవింగ్ క్లాసు కి. ఆది నా 6 వ క్లాసు.  ఈ సారి వాడు నన్ను ఎకంగా మెయిన్ రోడ్ మీదకి తీసుకువెళ్లాడు. అది కూడా మాంచి ట్రాఫిక్ టైము లొ. ఒక 20 నిమషాల తరవత చూస్తే మెయిన్ రోడ్ మీద వున్నాను. వాడు రోడ్ పక్కన వున్న స్పీడ్ లిమిట్ చూస్తూ వుండాలి అని చెప్పాడు. కారు కొంచం ముందుకు వెల్లిన తరవాత చూస్తె స్పీడ్ లిమిట్ 25 అని వుంది . నేను కారు  డ్రైవ్ చేస్తూ చేస్తూ వెళ్తున్నాను. కారు కొంచం స్పీడు గా వెల్తోంది అనిపించినప్పుడు నేను ఆక్సెల్రేటర్ మీద నా కాలు తీసేసేవాడిని. స్పీడోమీటర్ మాత్రం కరక్టుగా 25 చూపిస్తోంది. వాడు నా వైపు చూసి , తెలుగు సినిమా లొ హీరో విలన్ కి వార్నింగ్ ఇచే స్టైల్ లొ చెప్పాడు "Don't remove your foot from the accelerator" అని. నేను 'అయితే ఓకే అనుకుని వెళ్లిపొతున్నాను. ఒక చోట స్పీడ్ బ్రేకర్ వస్తే నేను వెళ్తున్న స్పీడ్ కి వాడికి కంగారొచ్చింది. కారు స్లొ చేస్తానొ లేక అదే స్పీడ్ లొ వెళ్లిపోతానేమో అని అనుమానం కూడా వచ్చింది.వెంటనే వాడికి భయం వేసింది. వాడు "BREAAAAAAAAAK" అని అరిచాడు.నేను కూడ అంతే స్పీడ్ గా నా లెఫ్ట్ లెగ్ తొ 'Break' వేసాను. వాడు వెంటనె స్టీరింగ్ పట్టుకుని సైడు కి కారు స్టాప్ చెసాడు. నా వైపు వాడు చూసిన చూపులకి రకరకాల అర్ధాలు. ఆది కొపమో మరేంటో నాకు తెలీలేదు. వాడు నా వైపు తిరిగి చూస్తున్నాడు.నేను మాత్రం స్ట్రైట్ గా రోడ్ మీదకి చూస్తూ వాడి next instruction కోసం ఎదురు చూస్తున్నాను.వాడు నన్ను "Did you clear the driving test in India ?' అని అడిగాడు. నేను మాత్రం వాడి వైపు తిరగకుండ, స్టీరింగ్ పట్టుకుని , స్ట్రైట్ గా  చూస్తూ, "Yeah,Yeah" అన్నాను.   ఫైనల్ టచ్ గా వాడి వైపు తిరిగి "YEAH" అన్నాను. వాడు 'హతవిధీ అన్నట్టుగా తల చేత్తొ పట్టుకుని వాలిపొయాడు.ఆ రొజు డ్రైవింగ్ క్లాసు తరవాత  వాడు ఇచ్చే స్లిప్ లొ 'Pressed the break with left leg' అని కామెంట్ రాసి ఇచ్చాడు. నేను ఆ స్లిప్ చూసి అమాయకంగా 'You only asked me to not to remove my foot from the accelerator no' అన్నాను. వాడు నోరు వెళ్లబెట్టి చూసాడు.ఏమనాలో తెలియలేదు వాడికి.

ఏలాగైతేనే, మార్టిన్ గాడు నాకు కారు డ్రైవింగ్ నేర్పించాడు. సారి నేనే కష్టపడి నేర్చుకున్నాను.  ఎంత కష్టపడ్డానంటే, ఆ కష్టం తో ఎవరైన విమానం ఇట్టే నేర్చుకుంటారు. వాడు ఇచ్చిన ఆ డ్రైవింగ్ టెస్ట్ కామెంట్ స్లిప్స్ అన్ని ఇంకా భద్రంగా దాచుకున్నాను.

Comments

Sreenivasa Rao Medisetti said…
Excellent narration guruvugaru....Chala rojula tarvatha kallalo neellu vachayi navvuki.....Bramhanandam ni uhinchukunnanu mi placelo...Keep blogging...
Unknown said…
'You only asked me to not to remove my foot from the accelerator no'

This dialogue is mind blowing man at the end. Very good arration. Keep sharing
Santosh said…
Bagundhi r..it is hilarious....specially neee swagatham ga anukunave manchi comedy touch ......aina left leg tho break anti r babu ani aa line chaduvuthunnapudu anukunna ..... asala vishyam full ga chadivina taruvatha ardham aiyyindhi :)
You only asked me to not to remove my foot from the accelerator no'
-----
Ha ha ha ha
Mahitha said…
ha ha , :)

ayite inni rojulu.. accelerator ni break anukunutnnara?!!!

narration style bagundi.
Anonymous said…
This is Awesome DUDEEEEEEEEEEE !!!! Kallalo nijanga neellu vachai navvaleka.. I liked it.
Srini said…
Meeru Katti Mastaroooooo
cbrao said…
ఆయ్ బాబోయ్! బ్రేక్ వేసేటప్పుడైనా ఆస్సిలేటర్ పై నుంచి కాలు తియ్యరన్నమాట. :)
ssss said…
Amazing narration ....u dont miss the nativity in ur language while writing....
Unknown said…
బాటసారి గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.
Sridevi Aduri said…
Did you clear the driving test in India ?

really??

hillarious.

sri
Unknown said…
Very nice,,
Eppudoo school lo chadhivina Baarister Parvatheesam gurthuku vasthundhi...
Unknown said…
kathi la rasavu....ni expe keka
gtyhrth said…
brother aa martin ekkada unnado maaku kuda cheppocchu ga....
Nenu kuda SA lonea unnanu and Naaku car driving raadu.......
Unknown said…
Chalaa bagundi

Popular posts from this blog

ఫొటో

ఎవరు నువ్వు ?

మొదటి అందం