రూం రెంట్

     ఇంజినీరింగ్ లొ చేరిన మొదటి సంవత్సరం అది.ఇంకా క్లాసులు సరిగ్గా మొదలవలేదు. నేను, రాజు, ప్రసాద్ ముగ్గురమె ఒక రూం లొ వుండేవాళ్లం.మా ప్రసాద్ గాడి ఫ్రెండ్ రవి కూడా మా వీధి లొనే చివరికి వుండేవాడు.
వాడి పేరు రవి అని నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. వాడికయితే ఇంకా వాడి పేరు "రవి" అని గుర్తుందని నేననుకోను. ఎందుకంటే, వాడిని అందరూ "బుగ్గలు" అని పిలిచేవారు. ఆ పేరు పెట్టింది కూడా ఎవడో కాదు. మా రాజు గాడు.  ఇంజినీరింగ్ నాలుగు సంవత్సరాలు కూడ వాడిని మా కాలేజి అందరూ అలాగే పిలిచెవారు. దానితొ వాడి పేరు వాడు మర్చిపొయడు. "బుగ్గలు" అని ఫిక్సయిపోయాడు. ఇంజినీరింగ్ అయ్యి పది సంవత్సరాలు అయినా, ఇప్పటికీ వాడిని అందరూ "బుగ్గలు" అనే పిలుస్తారు. వాడికి పెట్టిన ఆ పేరుని బట్టి, వాడి బుగ్గలు ఎలా వుంటాయో మీరే ఊహించుకొండి.

     క్లాసులు అవగానే వాడు మా ప్రసాద్ గాడితొ పాటు మా రూం కి వచ్చేవాడు. మాతొ పాటే మెస్ కి, మళ్లి మా రూం కి. వాడి రూం కి వాడు కనీసం పడుక్కోటానికి కూడా వెళ్లేవాడు కాదు. దాంతొ మా ఓనర్ కి డౌటు  వచ్చింది. మా ఓనర్ తొ పాటే మా బుగ్గలోడి ఓనర్ కి కూడా.
    మా ఓనర్ మా బుగ్గలోడిని చూసినప్పుడల్లా , వీడు రెంట్ ఇవ్వటంలేదు కాని, ఎప్పుడూ ఇక్కడే వుంటున్నాడు   అన్నట్టు గా చూసే వాడు. మా బుగ్గలోడి ఓనర్ కూడ వీడిని విచిత్రంగా చూసేవాడు. పాపం వీడు రెంట్ ఇచ్చేస్తున్నాడు కాని ఎప్పుడూ రూం లొ వుండడన్నట్టు చూసేవాడు.

    మా ఓనర్ కి ఓ రొజు మేము రెంట్ ఇవ్వటానికి వెళ్తే, మీరు నలుగురు వుంటున్నరు, సొ ఒక రెండొందలు ఎక్కువివ్వండన్నాడు.  ఎంత చెప్పినా నమ్మలేదు. చివరికి మా ఓనర్ లొపలికి వొచ్చి మా బుగ్గలోడి సామాన్లు ఎమి లేవని కనంఫర్మ్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసిన మా బుగ్గలోడు మా రూం కి రావటం తగ్గించేసాడు. మాకు కూడా ఎదో వెలితిగా అనిపించేది. ఇంక లాభం లేదనుకుని, మేమె మా బుగ్గలోడి రూం దగ్గరకి షిఫ్టయిపొయాము.   

        వాడి రూం దగ్గరగా వుండడంతో, మేమే వెళ్ళెవాళ్లం వాడి రూంకి. ఒక రోజు మా బుగ్గలోడు రెంట్ ఇవ్వటానికి వెళ్తే, వాళ్ల ఓనర్ వాడిని ఆరొందలు ఎక్కువిమ్మన్నాడంట. మరి మేము ముగ్గురం కదా !

Comments

Hi Aditya, chala baga narrate chesaru...saradaga anipinchindi chaduvutunnappudu, cinema style lo undi narration. Incident chinnade aina, chala interest teppincharu chivarivaraku!
Santosh said…
ee kadhlu anni sare kani ...ee math equations kakunda inaka amaina chepthav ani expect chesa ....English cinema la ila ardantaram ga apaesav !!!.....i hurt
Chinni said…
chaalaa baagaa vrasaaru.. mee postlu anni akkadaa aapanivvakunDaa chadivinchEstaaru..
Chinni said…
chaalaa baagaa vrasaaru.. mee postlu anni akkadaa aapanivvakunDaa chadivinchEstaaru..
thank you all...chinni garu, naa postlu nachinanduku dhanyavaadalu.
Anonymous said…
Madhoobala

Hello Aditya garu,
I read few of your posts.Excellent narration.I appreciate your inborn talent.ye ammayini chusina
meeku adbhutamga anipistunda leka meeku adbhutamga anipistene ila narrate chestara.
Your sense of humour is fabulous.


Madhoobala said…
By the by ilanti articles post cheyadam enduku apesaru...
Plz do continue
Unknown said…
Earn from Ur Website or Blog thr PayOffers.in!

Hello,

Nice to e-meet you. A very warm greetings from PayOffers Publisher Team.

I am Sanaya Publisher Development Manager @ PayOffers Publisher Team.

I would like to introduce you and invite you to our platform, PayOffers.in which is one of the fastest growing Indian Publisher

Network.

If you're looking for an excellent way to convert your Website / Blog visitors into revenue-generating customers, join the

PayOffers.in Publisher Network today!


Why to join in PayOffers.in Indian Publisher Network?

* Highest payout Indian Lead, Sale, CPA, CPS, CPI Offers.
* Only Publisher Network pays Weekly to Publishers.
* Weekly payments trough Direct Bank Deposit,Paypal.com & Checks.
* Referral payouts.
* Best chance to make extra money from your website.

Join PayOffers.in and earn extra money from your Website / Blog

http://www.payoffers.in/affiliate_regi.aspx

If you have any questions in your mind please let us know and you can connect us on the mentioned email ID

info@payoffers.in

I’m looking forward to helping you generate record-breaking profits!

Thanks for your time, hope to hear from you soon,
The team at PayOffers.in

Popular posts from this blog

ఫొటో

ఎవరు నువ్వు ?

హతవిధీ !!!