ఎవరు నువ్వు ?

“శైలేష్‌ని ఎందుకు చంపావు ? ”
“నేను చంపలేదు .”
“మరెవరు చంపారు ?..........................అడిగేది నిన్నే.. మాట్లాడవేం ? …….నాకు తెలుసు నువ్వే చంపావు .”
“చంపింది నేను కాదంటే వినవేం ?”
“నువ్వు కాకపోతే నీలోని రచయిత. ఇద్దరు ఒక్కటే కదా. ........”
“అన్నీ తెలిసి కూడా నన్ను ప్రశ్నిస్తావేం ?”
“ఆంటే నువ్వు రచయితవి కాదా ?”
“కాదు. నేను రచయితని కాదు.రచన నా వృత్తి అంతకన్నా కాదు .”
“వృత్తి కాకపోతే ప్రవృత్తి........పాపం శైలేష్....నిర్దాక్షిణ్యంగా బలయిపోయాడు .”
..“నా గురించి అన్నీ తెలిసి కూడా నన్నెందుకు విసిగిస్తావ్ ? వెళ్ళు అవతలికి. అయిన శైలెష్ నా కథలో సెంట్రల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని చంపితేనే ప్రేక్షకులు ఉత్కంఠగా చదివేది .”
“హన్ నాకు తెలుసు..మొన్నటికి మొన్న ….నీ నవలలో హీరోయిన్‌ని అందుకేగా చంపేసావు.? ఆ నవలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు అతితక్కువ కాలంలో ఎక్కువ కాపీలు అమ్ముడుపోయింది ఆ నవలే కదా…అయినా ప్రేక్షకుల్లో ఉత్కంఠ లేపటం కోసం ఒక మనిషిని చంపేస్తావా ?.కీర్తి,డబ్బు సంపాదించటం కోసం ఖూనీలు కూడా చేస్తావనుకోలేదు. రచయిత అంటే తన రచనలతో పదిమందికి ఙ్ఞానాన్ని పంచాలి కాని ఇలా ఖూనీలు చెయ్యకూడదు .”
“నేను చంపింది శైలేష్ అనే ఒక క్యారెక్టర్ని మాత్రమే. నిజంగా నేనేమి ఖూనీకోరుని,హంతకుణ్ణి కాదు. అసలు నా గురించి ఏమి తెలుసు నీకు ? నేను నా కథలోని సెంట్రల్ క్యారెక్టర్ని ఆఖరి పేజిలోనే చంపుతాను. ఎందుకంటే నా నవల మూసిన వెంటనే ప్రేక్షకుడికి ఆ క్యారెక్తర్ ఒక చెరగని ముద్ర వెయ్యాలి. పైగా సైకలాజికల్గా ప్రతీ పాఠకుడు తనని తాను నవలలోని సెంట్రల్ క్యారెక్టర్కి అన్వయించుకుంటాడు. దానికి తోడు నా నవల గురించి పదిమందికీ చెబుతాడు .”
“హన్ నాకు తెలుసు. నువ్వు నీ నవల చదివిన పాఠకుడి చేతనే పబ్లిసిటి ఇప్పిస్తావు .”
“ఏ రచయిత అయినా కోరుకునేది అదే. నిజం చెప్పాలంటే రచయిత తన పాఠకుడి చేత అలా చేయించగలిగాడు అంటే ఒక రచయితగా విజయం సాధించినట్టే. నేను కూడా రచయితగా కీర్తి కోరుకుంటాను. కీర్తి వస్తే డబ్బు ఆటోమేటిగ్గా అదే వస్తుంది.”
"మ్మ్ అంతా బాగానే వుంది....కానీ నీతో నేను ఏకీభవించను....కథలో కథానాయకుణ్ణి కానీ కథలోని సెంట్రల్ క్యారెక్టర్ని కానీ చంపితేనే పాఠకుడిలో ఉత్కంఠ వస్తుంది అంటే నేను నమ్మను. నా గురించి ఏం తెలుసు ? అని అడిగావు చూడు. నీ గురించి నాకన్నా ఎక్కువగా యెవ్వరికీ తెలీదు. "
" నాకు నీ నమ్మకంతో పని లేదు...ఏంటి ఏమన్నావు ? నా గురించి తెలుసా ? ఏది ఏమి తెలుసో చెప్పు చూద్దాం ?"
"తెలుసు....నీ గురించి అంతా తెలుసు..కాకపోతే నీలో వున్న రచయిత గురించే తెలీదు...అది తెలుసుకుందామనే ఈ ప్రయత్నం"
"తెలుసా ? అంతా తెలుసా ?? అసలు ఎవరు నువ్వు ?"
"నీ అంతర్ముఖాన్ని"

Comments

భలేగా ఉందే :)
Anonymous said…
hello aditya.. this is fine.. but pls talk abt a bit more burning issues..
Anonymous said…
hello aditya.. this is fine.. but pls talk abt a bit more burning issues..
Anonymous said…
Orey, telugu conversion is not quite clear.. Not sure how they did it, but i can see some correct converstion to telugu from other blogs...
Vishy
Anonymous said…
@Vishy, this is Kiran , Aditya's nephew. I helped him in converting the blog to telugu. you said the conversion is not proper. what is the problem you are facing exactly???...

Bye,

Kiran
Anonymous said…
"Rachayita ante tana rachanalato padimandiki jnananni panchali kaani ila khuneelu cheyyakoodadu" as an extract of your wirting rightly says anything you say should be simple and to the point ....the complex it is the less number of ppl you will touch ...of course that is my opinion ...you probably want to be unique among a elite junta ...
Anonymous said…
The writeup is ok. But, I was unable to maintain the kind of feeling that I got when I began reading this till the end. I think, this ended abruptly. Story raayaalani aapesaaraa enti?? :)
anyways, I liked the style and usage of words. Keep writing.
హాయ్, ఆది! Nice story. But be specific what you intend to tell and it should reach in true perspective. Copnstructions of sentences requires bit improvement, of course in my view. Alternatively can be taken as Modern art of writing. Finally, take some burning issues and express your views, probably with some sort solutions, if possible
Twisted DNA said…
bAgA rASAru. iMta chakkaTi bhAsha chadivi chAlA rOjulu ayyiMdi.
Anonymous said…
really well done!ucfw
Anonymous said…
been here done that?
Anonymous said…
really well done!uDi

Popular posts from this blog

ఫొటో

మొదటి అందం