ఫొటో
హైటెక్ సిటి లొ ఓ హైటెక్ ఆఫీస్
టైం సాయంత్రం 5:30 అయ్యింది. ఇంటికి వెళ్లిపోదాం అని చివరి సారిగా మెయిల్స్ చెక్ చేసుకుని, చాట్ చేస్తున్న ఫ్రెండ్స్ కి కూడా 'బై, సీ యౌ టుమారో' అని చెప్పి, సిస్టం లగౌట్ చేసేసాను
హెల్మెట్ తీసుకుని, నా వర్క్ స్పేస్ లోంచి బయటకి వస్తూ, ఇంకా పని చెస్తున్న నా ఫ్రెండ్స్ ని జాలిగా చూసి, 'బై గయ్శ్ అని చెప్పి ఆఫీసు డోర్ వైపు నడిచాను...
వడివడిగా వేస్తున్న నా అడుగులు, రిసెప్షన్ దగ్గర్కి చేరుకునేలోపు నాకు తెలియకుండానె స్పీడ్ తగ్గించేసాయి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎల్లో సిగ్నల్ పడినట్టుగా. రిసెప్షన్ దగ్గరకి వచ్చేసరికి రెడ్ సిగ్నల్ పడిపోయింది. ఎంత ప్రయత్నించినా అడుగు ముందుకు పడలేదు. కారణం, రిసెప్షన్ దగ్గర ఒక అమ్మయి. ఎల్లో కలర్ చుడిదార్ లొ వుంది. తన జుట్టు చెంపల మీదకి పడుతుండటం వల్ల మొహం సరిగ్గా కనిపించలేదు. 'ఈ ఎల్లో సిగ్నల్ ఎవరబ్బా ? ఇంటర్వ్యూ కి వచిందా ?' అని డౌటొచ్చింది. ఒక వారం క్రితమే వచ్చిన రెఫెరల్ మెయిలు గుర్తొచ్చి. ఖచ్చితంగా ఈ అమ్మాయి ఇంటర్వ్యూకే వచ్చి వుంటుందనిపించింది. ఇంటర్వ్యూలన్నీ సాధరణంగా మా మెనేజర్ చేస్తాడు. ఈ అమ్మాయి పేరు కనుక్కుని, నాకు బాగా, కావలసిన అమ్మాయి అని చెప్పి, ఎలాగైన ఈ అమ్మాయిని లొపలికి లాగేయాలి అని అనుకున్నాను.
నేను ఇలా అనుకుంటూండగా, డోర్ తీసుకుని లొపలికి ఒక ఇద్దరు వచ్చారు. డోర్ సౌండ్ విని ఆ అమ్మాయి తల పక్కకి తిప్పినప్పుడు చూసాను. "ఎంత అందంగా వుంది" అనుకున్నాను. వయసు ఒక 22-23 వుంటుందేమొ. నేనెప్పుడూ చూడని రూపం ఆమెది. కనీసం మా ఆఫీసులొ అయితే ఇంత అందమైన అమ్మాయిలు లేరని ఖచ్చితంగా చెప్పగలను. ఎలాగైనా ఈ అమ్మాయి మన కంపెని లొ సెలెక్ట్ అయిపొవాలని నేను దేవుడికి దండం పెట్టేసాను. "ఈ అమ్మయిది ఒక నెల సాలరీ నేను నీ హుండి లొ వేస్తాను స్వామి" అని. తన మెడలొ చూస్తే ఇంటర్వ్యూ టాగ్ వుంది. నేను ఊహించింది కరక్టె అయినందుకు సంతొషం గా అనిపించింది. కాని ఈ అమ్మాయి సెలెక్ట్ అవుతుందో లేదొనని టెన్షన్ మొదలయింది. ఏంత టెన్షన్ అంటే, ఈ అమ్మాయి కన్నా నాకే ఎక్కువన్నంతగా.
డోర్ తొసుకుని లొపలికి వచ్చిన వాళ్లు వాళ్ల సిస్టంస్ దగ్గరకి వెళ్లిపొయారు. ఈ అమ్మయిని చూసి ఒక చిన్న అర నవ్వు నవ్వాను. తను కూడా రెసిప్రొకేట్ చేసింది. తను కూర్చున్న సొఫ పక్కన టేబల్ మీద న్యూస్ పేపర్ వుంది. పోని పేపర్ చదవటానికి వెళ్లిన వంకతొ ఆ అమ్మయితొ మాటలు కలుపుదామంటే, మనకేమో అంత టాలెంట్ లేదు. ఎలాగైనా ఈ అమ్మయి డీటైల్స్ తెలుసుకోవాలనిపించింది. ఇంతలోనే సడన్ గా ఏదొ భయంతొ కూడిన ఆలొచన వల్ల వచ్చిన అనుమానం. ఈ అమ్మాయికి పెళ్లి అయిపోలేదు కదా అని..వెంటనే తల దించి తన కాలికి మట్టెలు వున్నాయేమొ అని చూసాను. 'హమ్మయ్యా అనిపించింది. నన్ను ఆ క్షణంలొ ఎవరైన చూసి వుంటే, నాకు వచ్చిన ఆ అనుమానం, వెనువెంటనే కలిగిన రిలీఫ్ నా మొహం లో క్లియర్ గా కనిపెట్టేవారు. ఎవరూ చూడలేదనుకున్నాను. కాని ఆ అమ్మాయి గమనించింది నన్ను. సిగ్గుపడుతూ తలదించుకుంది. అప్పుడు చూసాను తను సిగ్గుపడినప్పుడు బుగ్గన పడ్డ సొట్ట.
ఇంటర్వ్యూ కి వచ్చారా ? ఏ కంపెని లొ వర్క్ చేస్తున్నారు ? అని అడుగుదామనుకున్నాను. ధైర్యం సరిపోలేదు. 'నీకెందుకు బే అని అంటుందేమో అనిపించింది.
నేనిలా ఆలోచిస్తుండగా, నా ఫొన్ రింగ్ ఆయ్యింది. "ఎహె, ఈ టైం లొనె ఫొనె చెయ్యాల వీళ్లు" అనుకుంటూనే పౌచ్ లోంచి ఫొనె తీసి చూస్తే, 'ఆమ్మా కాలింగ్'. అసహనంతొనె ఫొనె లిఫ్ట్ చెసి, 'అమ్మ, నేను బయలుదెరుతున్నానూ అని అమ్మ చెప్పేది వినకుండా ఫొనె పెట్టేసాను. ఇంతలొ నా ఫ్రెండ్స్ ఇద్దరొచ్చారు రిసెప్షన్ వైపు. వాళ్లు కూడ బయల్దేరారు ఇంటికి వెల్లిపోదామని. "ఎంటి నువ్వు ఇంకా ఇక్కడె వున్నావా ? మీ మదర్ నీ కొసం నీ డెస్క్ నంబెర్ కి రెండు సార్లు ఫొన్ చేసారు. నువ్వు వెళ్లిపోయి అరగంట అయ్యిందని చెప్పాము అన్నాడు నా పక్కనె కూర్చునె నా ఫ్రెండ్ ఒకడు. మీ హౌసు ఇక్కడ నుంది 20 మినిట్స్ కదా. ఇంకా రాకపొవటమెంటని కంగారుగా మళ్లి చేసారు" అన్నాడు. "యా నేను మాట్లాడాను. మీరు వెళ్లండి. నాకు చాలా ఇంపార్టెంట్ పని ఒకటుంద"ని చెప్పి వాళ్లని పంపించేసాను.
ఇంతలొ HR వచ్చి ఆ అమ్మాయిని పిలిచాడు వీళ్లతొ మాటల్లొ వున్నప్పుడు. పేరు సరిగ్గ వినపడలేదు. "అయ్యో అమ్మయి పేరు కూడ కనీసం తెలుసుకొలేకపొయాను" అని అనిపించింది. ఇంటర్వ్యూ కి లొపలికి వెల్తే కనీసం ఒక గంట పడ్దుతుందని తెలుసు నాకు. నన్ను కూడ వన్ అవర్ ఇంటర్వ్యూ చేసాడు మా మెనెజర్ గాడు.
ఇంక చేసేదేమి లేక, నా హెల్మెట్ తీసుకుని బయల్దేరాను. బయట ఒకటే వర్షం. ఆగుదామా వద్దా అనిపించింది. వర్షం తగ్గేంతవరకు ఆగితే ఆ అమ్మయి బయటకి వస్తుంది. అప్పుదు మళ్లి చూడొచ్చనిపించింది. కాని మళ్లి 'అమ్మా కాలింగ్ అంటూ ఫొన్లొ డిస్ప్లె. వర్షం కూడ మెల్లిగా తగ్గుతోంది. ఆగిన వాళ్లందరూ కూడా బయల్దేరుతున్నారు. నేను కూడ బయల్దేరాను. నా బైకు ఒక కిక్ తొనె స్టార్ట్ అయ్యింది. వర్షం పడిన రోడ్ మీద బైకు ఝుమ్మంటూ ముందుకి దూకింది. రోడ్ ఖాలీగా వుండటంతొ స్పీడొమీటర్ 60 ని కిస్ చేస్తోంది.
ఇంటికి వెళ్లగానే అమ్మ 'ఎంట్రా, ఎప్పుడో బయల్దేరావని చెప్పారు నీ ఫ్రెండ్స్. నీ సెల్ ఒక్కొసారి సిగ్నల్ అందదు. పొని నీ డెస్క్ నంబర్ కి చేస్తే అక్కడా వుండవు. అని టవల్ ఇచ్చింది. తడిసిన నా వళ్లు తుడుచుకోమని.
సొఫ లొ కూర్చుని తల తుడుచుకుంటుంటే అమ్మ లొపల నుండి ఒక ఫొటొ చేతిలొ పట్టుకుని నా వైపే వస్తోంది.
Comments
సస్పెన్స్ ఎమి కాదండి...అది ఇంప్లిసిట్ ..ఫొటో లొ వున్నది ఆ అమ్మాయే
Photo lo vunnadi yellow pille ..
Really this is a great post,Thanks for sharing the information.
- SuryaHANA SAP HANA online training in India
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai
https://www.youtube.com/channel/UCJMx6_3I6oTEC858UVMuyzg/videos
plz watch our channel