Thursday, November 04, 2010

మరువకు నేస్తం

నింగి వొంగి కడలిని ముద్దాడితే,
అది చూసి సూర్యుడు సిగ్గుపడి
పశ్చిమానికి దిగిన వేళ
ఒక ప్రత్యూషపు చల్లగాలి
నీ కురులను తాకితే,
అది నా ఊపిరేనని మరువకు నేస్తం.

2 comments:

ఇందు said...

చాలాచాలా బావుంది మీ కవిత... :)

asr said...

gr8 feeling and good expression