స రి గ మ లు
భీమవరంలో ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న రొజులవి.మేము మొత్తం నలుగురుం ఫ్రెండ్స్ ఒక రెండు రూంస్ అద్దెకు తీసుకుని వుండేవాళ్లం. కాశి ,రాజు,ఫ్రసాద్ అండ్ నేను . ప్రసాద్ సివిల్ ఇంజినీరింగ్ మేము ముగ్గురుం ఎలెక్ట్రికల్. నేను, కాశి ఒక ఊరు వాళ్లమే. ప్రసాద్ వాళ్లది రాజమండ్రి. రాజు ది విజయనగరం.నేను కాశి 9th,10th కలిసి చదువుకున్నాము. రాజు,కాశి ఇంటెర్మీడియట్ కలిసి చదువుకున్నారు.
అసలే వేసవి కాలం దానికి తోడు పరీక్షలు కూడ దగ్గర పడుతున్నాయి.ఆందుకె తిరుగుళ్ళు తగ్గించి బుద్ధిగా రూంలోనే చదువుకునేవాళ్లం.ఫ్రతి రోజు మధ్యాహ్నం భొజనం చేసి వచ్చి మా ఇంటి ఓనర్స్ దగ్గర ఈనాడు న్యూస్ పేపెర్,ఒక వాటర్ బొటెల్ తెచ్హుకునే వాల్లం. ఓక రోజు మా ఓనర్స్ ని అడిగి ఈనాడు పేపెర్ ప్లస్ ఒక చల్లని వాటెర్ బోటిల్ అడిగి తెచుకున్నాము.రూం లొ నేను,కాశి,రాజు మాత్రమే వున్నాము .ఫ్రసాద్ వాళ్ళ క్లాస్మేట్స్ దగ్గరకి వెళ్లాడు.ఎప్పటిలాగే సినిమా పేపర్ ఒపెన్ చెసి చూస్తె ఒక అడ్వెర్తైసెమెంట్ నన్ను ఆకర్షించింది.' సరిగమలు లొ పల్గొనదలిచిన వారు ఈరొజు మధ్యాహ్నం భీమవరంలోని మర్గదర్సి ఆఫిస్ మేడ మీదకి రండీ అని దాని సారాంశం.
పాటలంటె పిచ్చి వున్న నాకు ఆ ప్రోగ్రాం లొ పల్గొనాలని ఎప్పటి నుండొ కొరిక.కాకపొతె పార్ట్నెర్ దొరక్క ఎప్పుడూ వెళ్ళలేదు. మరి ఈ సారి వచ్చిన అవకాశాన్ని వదులుకొవటం ఇష్టం లెక మా ఫ్రెండ్ రాజు ని తీసుకుని వెల్దామని డిసైడ్ అయ్యాను.మెస్ నుండి రాగానే రాజు జీను వేసాడు.నిద్రపొతున్న వాడిని తట్టి లేపాను.లేవలేదు. ఇంక కొట్టి లేపుదామనుకునేసరికి సరిగ్గా రూం లొ కరెంటు పొయింది.ఆ దెబ్బకి వాడికే మెలకువ వచ్చింది.వెంటనే నేను వాడిని 'ఒరేయ్ రాజు సరిగమలు ప్రొగ్రాం కి వెళ్ల్దాము రా రా ప్లీస్ ప్లీస్ అని వాడి గెడ్డం పట్టుకుని బ్రతిమాలి తీసుకు వెళ్ళాను. వాడు రాను అంటున్నా సరే వదలకుండా'. అదే నేను చేసిన ఘోరమయిన తప్పు. ఆప్పుడు తగిలిన దెబ్బకి ఇప్పటికీ ఇంకా కోలుకొలేదు. వాడి కంఠం చాలా యునిక్ కంఠం. కంచు .అది మామూలు కంచుకాదండి...ఈజీనగరం కంచు.వాడి గొంతు విన్న వాళ్ళు ఫస్ట్ టైం అయితె షాక్ అవుతారు.
ఇద్దరం మార్గదర్శి ఆఫీస్ కి వెళ్ళాము. ఆఫీస్ బయట చాల సైకిల్స్,స్కూటర్స్, బైకులు వున్నాయి. చూడగానే కాంపిటిషన్ అర్ధమయ్యింది నాకు. బాగ పెర్ఫొర్మ్ చేస్తేనే కాని మనకి 'సరిగమలు 'లొ పాల్గొనె అవకాసం రాదనిపించింది. మార్గదర్సి ఆఫీసు కి వెల్తే బొయ్ మేడ మీదకు వెళ్లమన్నాడు. మేడ మీద ఒకటె గోల.వాళ్ళు పాటలు పాడటానికి వచ్చారో లేక పొట్లాటకి వచ్చారో తెలీలేదు.కొంత మంది చేతిలో పాటల పుస్తకాలు కనిపించాయి. కొంచం షాక్ అయ్యాను.వీళ్ళు ఈ అవకాసం కోసం ఎప్పటి నుండొ కాచుకు కూర్చున్నట్టువున్నారనిపించింది. మేమిద్దరమె 'ఊపుకుంటు' వెళ్ళాము. పాటల పుస్తకాలు తెచినవాళ్ళు తెగ చదివేస్తున్నారు. ఆ చదివే కాన్సెంట్రేషన్ కనుక నిజంగా ఏకాంపిటెటివ్ ఎగ్జాం లొనొ పెట్టి వుంటె బాగుంటుంది అనుకున్నాను. నేను అయితే అంత కాన్సెంట్రేషన్ గ ఎప్పుడూ చదవలేదండోయి.. చివరికి నా ఎంసెట్ ఎగ్జాం కి కూడా. ఒక వైపుకి తిరిగి చూస్తె ఒక అమ్మయి తను నేర్చుకున్న సారి తను బట్టిపట్టిన పాటని అప్పచెప్పేస్తోంది...మరో వైపు నా వయసులొ వున్న ఒక అబ్బాయి తెగ తిరిగెస్తున్నాడు.....పాటని రివిజన్ చేస్తున్నాడు అనుకుంట. నేను వెంటనే మా రాజు గాడితొ 'ఒరెయ్ రాజు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. నువ్వు మంచి పాటని సెలెక్టు చేసుకుని బాగ పాడు. నేను ఎలాగో బాగనే పాడతాను అనుక్కొ.' అన్నాను. ఇంతలో ఒక అబ్బాయి వచ్చి 'మీ పేరు,అడ్రస్సూ ఈ పేపర్ లొ రాసి ఇవ్వండి అని ఒక కాగితం ఇచ్చాడు .ఇద్దరం అందులొ మా పేర్లు రాసాము. కాని అడ్రస్సు ఏ అడ్రస్సు ఇవ్వాలా అని ఆలొచనలో పడ్డాము. మా ఊరు అడ్రస్సు ఇస్తే కనుక ఒక వేళ 'సరిగమలు ' లొ సెలెక్టు అయితే ఇంటిమేషన్ అక్కడకి వెళ్తుంది. ఆ విషయం మాకు తెలిసేసరికి మేము కెమెరా ముందు పాడే డేటు కూడా దాటి పొతుందని ఆలొచించి చివరికి భీమవరం లోని మా రూం అడ్రస్సు ఇచ్చాము. ఇద్దరేసి చప్పున లోపలికి వెళ్ళి వస్తున్నారు. వెళ్ళిన వాళ్లలొ కొంత మంది ఏడుస్తూ బయటకి వస్తున్నారు. వాళ్ళు సెలెక్టు అవ్వలేదని వాళ్ళ వాలకం చూడగానే అర్ధమయ్యింది. ఎలాగైనా సెలెక్టవ్వాలన్న పట్టుదల పెరిగింది. చివరికి మా వంతు వచ్చింది.
లోపల ముగ్గురు జుడ్జెస్ వున్నారు. అందరూ 40లొపె అనుకుంట. మేము వెళ్ళగానే కుర్చిలొ కుర్చొమన్నటు చెయి చూపించాడొకతను. థాంక్స్ చెప్పి మరీ కుర్చున్నాను నేను అయితె. రాజు గాడు చెప్పనందుకు నాకు కొపం కూడ వచింది. రాజు నాకు కుడి వైపు కుర్చున్నాడు. మాకు ఎదురుగ కుడి వైపున కూర్చునతను'సితార ' చదువుతున్నడు. మధ్యలొ వున్నతను ఈనాడు, మరొ అతను 'స్వాతీ' చదువుతున్నారు. వీళ్ళు సీరియస్గా జుడ్జె చెయ్యటనికి రాలేదెమొ అనిపించింది నాకయితె. సితార చదువుతున్నతను మా రాజు గాడి వైపు చెయి చూపించి 'మీరుపాడండీ అని చెప్పి సితార లొ మునిగిపొయడు. వెంటనె మా వాడు 'స్వర రాజగంగా ప్రవాహమె' అంటూ మొదలు పెట్టాడు.వాడు ఆ పటని ఏ కంఠం తొ పాడాడు అంటె ...' రావు గొపాల రావు ' ఆ పాటని పాడితే ఎలా వుంటుందొ ఊహించుకోండి ఒక్కసారి.... హా కరక్టు గా అలాగే పాడాడు. పాపం పాట పాడమని అడిగిన వాడి రొజు ఆ వేళ బాగొలెదనుకుంట ఛదువుతున్న మేగ్జిన్ ని కిందకిపెట్టి 'స్వర రాజ కాదు బాబు, స్వర రాగ ' అని కరక్టు చేసాడు.వెంటనె రాజు 'హా అదె లెండీ అని చెయ్యి ముందుకు చాపి(సారి అన్నట్టుగా) మళ్ళి అదే టోన్ లొ 'స్వర రాగ గంగా ప్రవాహమె' అని మళ్ళి పాటని మొదలు పెట్టాడు.అంతె పాడమని అడిగిన వాడు 'మీరు ఇంక ఆపండి అన్నాడు '. ఫ్రవహిస్తున్నగంగకి ఆనకట్ట పడింది. మిగిలిన ఇద్దరూ ఒక్క సారి మా వాడి గొంతు విని నోరు వెళ్ళబెట్టి చూసారు. ఆ చూపులకి రక రకల అర్ధ్హాలు.. వెంటనే మొదటి వ్యక్తి తేరుకుని (ధైర్యం ఎక్కువనుకుంట) మీరు పాడండి అని నన్ను పాడమన్నాడు. 'రాజు క్లాసికల్ పాడాడు కదా మనం కొంచం ఫాస్ట్ బీటు పాడదామని అని డిసైడ్ అయ్యి ' మేఘాలె తాకింది హై హై లెస్స ' అని అందుకున్నాను. మేఘాలని తాకేనొ లేదొ అంతలొ 'మీరు ఆపండీ అని మరల అదే గొంతు.మీరు ఇక వెళ్ళండి అని పాపం చాల మర్యాదగ చెప్పడు అతను.అదే నేను అయితే కనుక మెడ పట్టి గెంటెసె వాడిని. బయటకి వస్తూ 'మేము సెలెక్టు అయ్యామా అండి ?' అని అమాయకంగా అడిగాను నేను. వెంటనె ఎవరో 'మీకు టెలిగ్రాం లొ రిసల్టు పంపుతాము. మీరు వెళ్ళండి ' అని జవబు చెప్పాడు. ఇద్దరం గబగబా కిందకి వచ్చాము.లొపల జరిగిన సీను తలచుకుంతూ చాల సేపు నవ్వుకున్నాము ఇద్దరము. సైకిల్సు తీసుకుని మా రూం కి వెళ్ళి పొయాము. ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అని మేము ఇద్దరం డిసైడ్ అయ్యాము కూడ. అసలు రాజు గాడు వాళ్ళని వెళ్లగానే విష్ చెసి వుంటె మమ్మల్ని పూర్తిగ పాడనిచేవారేమో అనిపించింది నాకు. ఇదె విషయం వాడితొ అంటె వాదు నా వైపు అదో రకమయిన లుక్కు ఇచ్చి తల తిప్పుకున్నాడు.
మా ఫ్రెండు కాశి గాడు మా కొసం వేయి కన్నులతొ ఎదురు చూస్తున్నాడు. ఇంతకి ఏమయింది రా అని అడిగాడు వాడు మేము ఇంకా రూము లొపలికి అడుగు పెట్టకుండానె. నెను వాడు 'టెలిగ్రాం లొ చెబుతాడంటరా' అని చెప్పి టాపిక్ డైవెర్టు చేసెసాను. ఆ తరవాత నుండి మేము మధ్యాన్నం కాలేజు నుండి లంచ్ కి రూం కి వచ్చే దారిలో ప్రతి సారి పొస్ట్ మాన్ ని 'మాకు ఏమైనా టెలిగ్రంలు వచ్చాయ అండి ?' అని అడిగె వాడిని. రాజు గాడు ఒక్క సారి కూడ పట్టించుకోలెదు. ఫ్రతి రొజు ఒక్కటె జవాబు.'మీకు రాలెదు బాబు అని '. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ లొకి వచేంత వరకు ఈ విషయం ఎవ్వరికి తెలీదు.చివరికి వాడె చెప్పేసాడు అందరికి. అందరూ నన్ను తిట్టారు. 'వాడిని ఎందుకు తీసుకు వెళ్ళవు రా? " అని. ఇప్పటికి నేను వాడిని 'ఏంటి బాబు స్వరరాజ నా ? రాజ కాదు రాగ అంటె...అదే లెండా ??" అని ఎడిపిస్తాను. ఈ సంఘటన విన్న ప్రతి వాడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు. ఓకడు అయితే నవ్వుతూ నవ్వుతూ పక్కనే వున్న స్విమ్మింగ్ పూల్ లో దూకేసాడు .ఇప్పటికీ నాకు అనిపిస్తుంది. రాజు గాడు వాళ్ళని విష్ చెసి వుంటే కనీసం నా పాటయినా వాళ్ళు పూర్తిగా వినేవాళ్ళేమొ అని.

Comments
I was in my B.E. second year then.