మొదటి అందం

రాజమండ్రి రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫారం నుండి హౌరా-చెన్నై మెయిల్ అప్పుడే బయలుదెరింది.
భుజాన ఒక బాగ్ తొ ఫరుగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ ఎక్కాను. హడావిడిగా ఎక్కడం వల్ల ఏ కంపార్ట్ మెంట్లోకి ఎక్కానొ తెలీదు. ఆప్పుడే బాత్ రూం లోకి వెల్తున్న ఒక పెద్దాయన్ని అడుగుదామని అనుకున్నాను “ఇది ఎ కంపార్ట్ మెంట్ అని”. ఫరుగెత్తుకుంతు వచ్చి ఎక్కడం వల్ల వచ్చిన ఆయాసం తో గొంతులొ మాట గొంతులొనే ఆగిపొయింది. కంపార్ట్ మెంట్ గేట్ దగ్గరే నిలబడడంతో
చల్లగలి నా మొహన్ని తాకి, నుదుటిన పట్టిన చెమటని తుడిచెసింది. ఆమ్మ తన చీర కొంగుతొ తుడిచినట్టుగ.శరీరం చాల ఉల్లాసంగా వుంది.
వీచే గాలిని కొంచెం సేపు ఆస్వాదిద్దామని అక్కడే నిలబడ్డాను. ఒక రెందు నిమిషాల తరవాత బాత్ రూం తలుపు చప్పుడవటం తో వెనక్కి తిరిగి చూసాను. పెద్దాయన బయటకి వచ్చారు. తెల్లటి జుబ్బా వేసుకుని ఉన్నారు. వయసు ఒక 50 పైన ఉంటుంది. బ్రాహ్మడనుకుంటా.. జంధ్యంపోగు చెవికి తగిలించాడు .నుదుటిన చిన్న తిలకం బొట్టు వుంది.. ఆప్పుడు అడిగాను ' సర్ ఇది ఏ కంపార్ట్ మెంట్ అని. ఫెద్దాయన నన్ను పైనుండి కిందకి అదోలా చూసి S-2 అని చెప్పారు. ఆప్పుడు అర్ధమయ్యింది నా బెర్త్ కి వెళ్ళాలంటే మధ్యలొ S-3 దాటుకుని వెనక్కి వెళ్ళాలని.

మధ్యలో జనాల్ని తప్పించుకుని చివరికి నా బెర్త్ దగ్గరకి చెరుకున్నాను. భుజాన వున్న బాగ్ లోంచి వాటర్ బాటిల్ తీసి రెండు గుటకలు నీళ్ళు తాగాను. నా సీటుకి ఎదురుగుండ ఒక అమ్మయి కుర్చుని వుంది. కిటికి లొంచి బయటకి చూస్తుా ఉండటం వల్ల మొహం పూర్తిగా కనిపించటం లేదు. కిటికి లొంచి బయటకి చూస్తూ, గాలికి ఎగురుతున్న తన కురులను చెవి వెనక్కి తొసెస్తొంది..తదేకంగ తననె చూస్తున్నానని గమనించినట్లు వుంది ఆ అమ్మయి నా వయిపుకి తిరిగింది.. ఒక చిన్న చిరునవ్వు నవ్వి "హి. నా పేరు సంధ్య" అని తనని తాను పరిచయం చేసుకుని చెయ్యి ముందుకు చాపింది. “ఈ అమ్మయి మరీ ఫాస్ట్ అనుకుంటా, వెంటనే చెయ్యి ఇచ్చేసింది” ఆనుకున్నాను నాలొ నెనె. వయసు 22,23 వుంటుంది. ఇది వరకు నేను ఎప్పుడూ చూడని రూపం ఆమెది. పేరే కాదు, ఆమె రూపం కూడా చాల అద్భుతంగ వుంది. ముఖాన వంకీలు తిరిగిన బొట్టు బిళ్ళ, ముక్కుకి చిన్న ముక్కు పుడక వున్నాయి. చెవికి అందంగ జుంకాలు వెలాడుతున్నాయి.. ఉగాది రోజున మా ఇంటికి వేలాడే మావిడాకుల్లా.,మొహంలొ ఎదో తెలియని ఆకర్శణ, ప్ర,సాంతత కనపడుతున్నాయి. రైలు గోదావరి బ్రిడ్జి దాటుతొంది. దూరంగా సూర్యుడు అస్తమించటానికి సిద్దంగ వున్నాడు సూర్య కిరణాలు గోదావరి నీటి మీద పడి పరావర్తనం చెందుతున్నయి. దూరంగా పడవ మీద ఒక ముసలి వాదు చేపలు పట్టడానికి వల వేస్తున్నాడు. ఆకాసం లొ పక్షులు గుంపుగ గోదావరి దాటుతున్నయి. చాల అద్భుతంగ వుంది ఆ దృశ్యం. వెంటనే నెను నా కళ్ళల్లో బంధించాను ఆ దృశ్యాన్ని. కళ్ళతొ కూద ఫొటోలు తీయొచ్చని మొదటి సరి అనిపించింది. రైలు గోదావరి బ్రిడ్జి దాటింది. “హల్లొ సర్, మిమ్మల్నె..నా పేరు సంధ్య ఫైనల్ ఇయర్ మెడికోని’ అని మళ్ళీ తన పెరు చెప్పింది నా పేరు ఏమిటన్నట్లుగా. ‘ఓహ్.. Sorry, నా పేరు ఆకాశ్ . Working as a Marketing Executive ’ అని నన్ను పరిచయం చేసుకుని నేను కూడా నా చెయ్యి ముందుకు చాపాను.
‘ఎంత వరకు ప్రయాణం?” అడిగిందామె.
‘నేను చెన్నై వెళ్తున్నానండి. మరి మీరు ?’.
‘నేను కూడ ఛెన్నై వెల్తున్నాను. కాని మా College Hostel మాత్రం చెన్నై కి 30 KM దూరం’.
ఆమెతొ మాటలు కలిపిన కొద్ది సేపటిలొనె అర్ధమయ్యింది..ఈ అమ్మాయి extrovert అని. ఆందుకనేమో మిగిలిన అమ్మయిలకి భిన్నంగా తనని తాను first పరిచయం చేసుకుంది..
‘వేషధారణ modern గ లేకపొయిన కొంచెం culture తెలిసిన అమ్మయిలా వుంది. ఎంతయినా సిటీలో చదువుకుంటోంది కద’ అనుకున్నాను నాలొ నేనే..

ఆమెతో మాట్లాడటం కన్నా ఆమె మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. గొంతు కూడా చాల తియ్యగ వుంది. కోకిల పాట పాడుతున్నట్లుగ.
మధ్యలొ ఆగిన రెండు మూడు స్టేషన్లలొను కూడా మా బెర్త్ వున్న చోటుకి ఎవరూ ప్రయాణీకులు రాలేదు. కంపార్ట్ మెంట్ కూడ ఖాళీగానే వుంది.. అక్కడక్కడ ఒక ఇద్దరు ముగ్గురు జనాలు తప్ప.

రైలు ప్రయాణం ఇంత మధురంగ సాగటం నాకు చాల కొత్తగా అనిపించింది. నేను ఎప్పుడు ట్రైన్ ఎక్కినా నా చుట్టూ ముసలోళ్ళో, లేక పోతె మరీ చిన్నపిల్లలొ తప్ప ఇంత అందమైన ఆడపిల్ల ఎప్పుడు కలవలెదు.

నేను వున్న కంపార్ట్ మెంట్లోకి ఒక కుర్రాడు ‘సమొసాలు,’ అంటూ వచ్చాడు. నేను అయిదు రూపాయల కాయిన్ వాడి చేతికి ఇచ్చి యెన్ని వస్తె అన్ని ఇమ్మన్నాను. వాడు నాలుగు సమొసాలు పొట్లం కట్టి చేతికి ఇచ్చాడు. పొట్లం అందుకుంటూనె ‘ఏంటి బాబు, సమొసాలు వేడుగ లేవు’ అని అదిగాను.
దానికి వాడు ‘నేను సమొసాలు అన్నాను కాని వేడి సమొసాలు అనలేదు కద బాబుగారు’ అని చెప్పి వెళ్ళిపోయాడు అయిదు రూపాయిల కాయిన్ అందుకుని.
వాడన్న ఆ మాటలకి సంధ్య పకపక నవ్వింది.. ఆప్పుడు గమనించాను తను నవ్వుతూ వుంటే బుగ్గన పడిన చిన్న సొట్టని. ఆ బుగ్గ సొట్టలొ నా చూపులు చిక్కుకున్నట్టు వున్నాయి ఎంత ప్రయత్నించినా బయటకి రాలేక పొయాయి. ఆప్పుడు రాసాను నా మనసు ఫలకం పై “నేను చూసిన మొదటి అందం నీ రూపం” అని..వాడు వేసిన కుళ్ళు జొకుని పదే పదే తల్చుకుని తెగ నవ్వుతోంది.. కొంచెం సేపు ఓపిక పట్టాను..కాని నవ్వు మాత్రం ఆగలెదు.. నాకు ఒళ్ళు మండుతున్నా, తల్చుకుంటే నాకు కూడా నవ్వు వస్తోంది. కాని నా మీద వేసిన జోకుకి నేను నవ్వటానికి ఇగో అడ్డొచ్చింది. సమోసాలు తినాలనిపించలేదు కాని బయటకి పారెయ్యటం ఇస్టం లేక బలవంతంగా తినాల్సి వచ్చింది. నా అసహనాన్ని గమనించినట్టు వుంది సంధ్య. “నా దగ్గర బిస్కట్స్ వున్నాయి తింటారా ?” అని అడిగింది. “మీరు ఈ సమోసాలు తింటే నేను బిస్కట్స్ తింటాను” అని అన్నాను చిన్న పిల్లాడిలాగ. మొహమాటపడుతూనే ఒకటి తీసుకుని నా చేతిలొ రెండు బిస్కట్లు పెట్టింది. భిస్కట్లు తిని మంచి నీళ్ళు తాగి అప్పుడడిగాను “ఆవునూ అడగటం మర్చిపోయాను మీరు ఒక్కరే వెల్తున్నారు చెన్నై కి మీతొ మీ ఫ్రెండ్స్ ఎవరూ లెరా ?” అని.
“లేదండి నా ఫ్రెండ్స్ విజయవాడలో ఎక్కుతారు”. వైజాగ్ నుండి మా క్లాస్ లొ నేను ఒక్కర్తినె అంది.
ఆప్పుడర్ధమయ్యింది సంధ్య వైజాగ్ అమ్మాయని.


ట్రైన్ ఏలూరు ప్లాట్ఫారం మీదకి వొచింది. ఏవడొ 'కూల్ డ్రింక్శ్ అని అరుస్తున్నాడు.సంధ్య వాడిని పిలిచి 'ఒక ఫాంటా ఇవ్వి అని ఆర్డరు వెసింది.వాడు డ్రింక్ ఇస్తూ 'ఆరు రూపయలమ్మ గొరూ అన్నడు. సంధ్య డ్రింక్ సిప్ చెసి,వాడికి డబ్బులు ఇవ్వటానికి తన హ్యాండ్ బాగ్ ఒపెన్ చెసింది. ఆందులొంచి మొదట ఒక దువ్వెన, ఒక చిన్న అద్దం, ఒక లిప్స్టిక్, ఒక బొట్టు బిల్లల పాకెట్, ఒక కాటుక, పౌడెర్ డబ్బ తీసింది. కూల్ డ్రింకుల వాడు చాలా అస్చర్యం తొ చూస్తున్నాడు.వాడితొ పాటె నీను కూడ ఇంకెమి తీస్తుదొ అని. ట్రైన్ కూత పెట్టింది.వాడి మొహం లొ ఇప్పుడు అస్చర్యనికి బదులు అనుమానం కనపడుతొంది.ఏక్కడొ విన్నట్టు గుర్తు అమ్మయిలు హ్యాండ్ బాగ్ లొ బ్యుటి పార్లర్ దాస్తారు అని. ట్రైన్ కదలటం మొదలు పెట్టింది.ఆ కంగారులొ సంధ్య చెయ్యి తగిలి తను బయటకి తీసిన బ్యుటి పార్లర్ మొత్తం కింద పడిపొయింది.పౌదెర్ డబ్బ తొ ఆగలెదు. తరవాత ఒక చిన ఆడ్రెస్ బుక్, ఒక పెన్, ఒక సెల్ ఫొను బయతకి తీసింది ఫైనల్ గా ఒక చిన్న పర్సు బయతకి తీసింది.కూల్ డ్రింకుల వాడు ట్రైన్ తొ పాటె పరిగెత్తుతున్నడు.ఆ సెనె చూస్తు వుంతె నవ్వు వొచింది.పాపం వాడిని చూస్తె జాలి వెసింది.వెంటనె నీను నా జెబులొంచి ఒక 5 రూపయల కొఇన్, ఒక రూపయి కొఇన్ వాదికి ఇచాను. ఫ్లాట్ఫొరం మొత్తం పరిగెత్తినత్తు వున్నడు, ఆయసం తొ కూలబడిపొయాడు.సంధ్య తన సుపెర్ మర్కెట్ ని మళ్ళి తన హ్యాంద్ బాగ్ లొ సర్ది థాంక్స్ చెప్పింది."Hows does a girl keep the entire world in just a small hand bag ? " అనుకున్నాను నాలొ నేనె.
ఇద్దరి మధ్యన కొంత సేపు మౌనం.నవ్వు ఆపుకొలేక పెదవులు బిగించి నవ్వుతున్నాను నేను. సంధ్య 'స్వాతి ' మాగ్జిన్ లొ లీనమయిపొయింది.



టైమ్ రాత్రి 9:00 దాటింది.…విజయవాడ ప్లాట్ ఫారం మీదకి ఎంటర్ అయ్యింద్. ‘బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ ’ అని యెవడో అరుస్తున్నాడు. నేను వాటర్ బాటిల్ లొ నీళ్ళు నింపటానికి దిగుతూ, ‘మీకు ఏమైన తీసుకు రమ్మంటారా ?’ అని అడిగాను. ‘వద్దండి. నేను నా డిన్నర్ తెచ్చుకున్నాను’ అంది. నేను కిందకి దిగి వాటర్ నింపుకుని పదిహేను నిమిషాల్లొ వచ్చాను. చూస్తె ఎదురుగ సంధ్య కనిపించలేదు. కొంచం సేపు కంగారు పడినా, ‘ఫ్రెండ్ ని కలవటానికి వెళ్ళి ఉంటుందిలె’ అని అనిపించింది. ట్రైన్ కదిలింది కాని సంధ్య మాత్రం రాలెదు. ఎందుకో గుండె వేగం పెరిగింది ట్రైన్ తొ పాటే.. ‘కిందకి దిగి ట్రైన్ యెక్క లేక పోయిందా ? అయ్యొ పాపం’ అనుకుంటూనే కంపార్ట్ మెంట్ గేట్ దగ్గరకి వెళ్ళి బయటకి చూసాను. ఎవరూ ట్రైన్ అందుకోవటానికి పరిగెడుతున్నట్టు కనిపించలేదు. ‘ఎక్కడికి వెళ్ళినట్టు ? నాలో నేనే ప్రశ్నించుకున్నాను. ఇంతలొ భుజం మీద ఎవరో తట్టి పిలిచారు. వెనక్కి తిరిగి చూస్తే సంధ్య. ప్రాణం లేచి వచ్చింది. ‘ఏంటండి ఇక్కడ యెవరి కోసం నిలబడ్డారు ? ఎవరైన రావలసి వుందా ?’ అని అడిగింది. ‘లేదండి ..జస్ట్ ఊరికె నిలబడ్డాను’ అని చెప్పి వచ్చి నా సీట్ లొ కుర్చున్నాను. నా వెనకే తను కూడా వచ్చి సీట్ లొ కుర్చుంది. సైడ్ బెర్త్ లొ ఒక పెద్దాయన వున్నాడు. ఫుస్తకంలొ లీనమయిపోయాడు..
సంధ్య తను తెచ్చుకున్న డిన్నర్ ఒపెన్ చేసింది. ఆరిటాకులొ దద్దోజనం . చూడగానె నోట్లో నీళ్ళు ఊరాయి. ‘మీరు డిన్నర్ యెమి తెచ్చుకున్నారు ?’ అని అదిగింది. ‘నేనా ? నేను...ట్రైన్ జర్నీలొ యేమి తిననండి’ మీరు తినండి అన్నాను. ‘ఫరవాలెదు..ఇది ఇద్దరం షేర్ చేసుకుందాం. ప్లీజ్..కాదనకండి. ఇది ఇద్దరు కదుపునిండా తినొచ్చు’ అంటూనే నా చేతిలొ ఒక చిన్న అరిటాకు ముక్క పెట్టి అందులొ సగం దద్దోజనం పెట్టింది. ఒక ముద్ద నోటిలో పెట్టుకున్నాను. ఆమృతం లా అనిపించింది. అంతే. దద్దొజనం టేస్ట్ నా మొహమాటాన్ని జయించింది. ఈ మధ్య కాలంలొ దద్దోజనం తినలెదు. ఆందులోను అరిటాకులో . ఆయిదు నిమిషాల్లొ మొత్తం తినేసి మంచి నీళ్ళు తాగి, చేయి కడుక్కుని వచ్చి నా సీట్ లొ కుర్చున్నాను. ‘దద్దోజనం యెలా వుంది ?’ అని అడిగింది. ఎలా చెప్పాలొ మాటలు రావటం లేదు. సింపుల్ గా ‘మా అమ్మ చెసినట్టు వుంది’ అన్నాను.
తను కూడ తిని మంచి నీళ్ళు తాగి చెయ్యి కడుక్కుని వచ్చి కుర్చుంది. ట్రైన్ పొలాల్లోంచి సాగిపొతొంది. బయట పిండారబోసినట్టుగ చిన్నగ వెన్నెల. పక్కన కుర్చున్న పెద్దాయన అప్పుడే నిద్రలోకి జారుకున్నాడు. తరవాత స్టెషన్ లొ మా కంపార్ట్ మెంట్ లొకి కొంత మంది యెక్కారు కాని ఎవరూ మేము వున్న చోటికి రాలేదు. ఇద్దరమూ కిటికిలోంచి మౌనంగ బయటకి చూస్తున్నాము. ట్రైన్ శబ్ధం తప్ప ఇంకేమి వినపడటం లేదు. కొంచం సేపు తరవాత ‘నేను పదుకుంటాను అంది. గుడ్ నైట్. మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం’ అంటూనె తన బెర్త్ మీదకి యెక్కి పడుకుంది సంధ్య. నాకు మాత్రం నిద్ర పట్టడంలేదు. చాలా సేపు అలా బయటకి చూస్తునే వున్నాను. నా బాగ్ లోంచి ఐ-పాడ్ బయటకి తీసాను. ‘Instrumental folder select చేసి ఇయర్ ఫోన్స్ చెవికి తగిలించాను. ఇప్పుడు ట్రైన్ శబ్ధం వినపడటం లేదు. ఆర్టిస్ట్ యెవరొ గుర్తులేదు కాని, వయొలిన్ మాత్రం వినిపిస్తోంది. ఆలా వింటూనే నడుం వాల్చాను. ఎప్పుడు పడుక్కున్నానో తెలీదు. లేచి చూసేసరికి ట్రైన్ చెన్నై స్టేషన్ వచ్చేసింది. ఎదురుగ సంధ్య కనపడలెదు. నా కళ్ళు చాల ఆత్రంగ వెతికాయి. కాని ఫలితం మాత్రం శూన్యం. కిందకి దిగుతూనె పోర్టర్ ని అరవంలొ అడిగాను ‘యెంత సెపు అయింది ట్రైన్ వచ్చి అని ?’. వాడు 15 నిమిషాలు అయ్యిందని చెప్పాడు.
ఫ్లాట్ఫారం మీద కొంత మంది గుమిగూడి వున్నారు.ఏవరిదో గొల్డ్ చైన్ కొట్టెసారంట. ఇంకెవరిదొ లగెజి పొయిందంట.ఫ్లాట్ఫొరం మొత్తం హడవిడిగా వుంది.

చేసేది యెమి లేక స్టేషన్ బయటకి వచ్చి ఆటో యెక్కి ఇంటికి వెల్లాను. ఆ రొజు ఆఫీసు కి 20 నిమిషాలు లేటుగ వెళ్ళాను. పని చెయ్యాలనిపించలెదు. సంధ్య రూపమే మనస్సులొ మెదులుతొంది. మరచిపోవటానికి ఎంత ప్రయత్నించిన, నా వల్ల కాలెదు. అన్యమనస్కంగానె పని చెసాను రొజంత.రాత్రి ఇంటికి వొచ్చి భొజనం చెసి పడుకున్నాను.

మర్నాడు ఉదయం 6:00 గంటలకి లేచి పేపర్ తీస్కువొచాను. మెయిన్ పేజి లొ అమ్మ న్యూసు.తరవాత పేజి లొ ఒక ఫొటో నన్ను కన్నార్పనివ్వలెదు.పైన న్యూసు మాత్రం ' ట్రైన్ దొంగ అర్రెస్ట్ ' అని. వెంటనె వెళ్లి నా బ్యాగ్ లొ ఐ-పోడ్ కోసం వెతికాను.కనపడలేదు.ఏమి జరిగిందో అర్ధమయ్యింది.ట్రైన్ లొ లగేజి, గొలుసు,నా ఐ-పోడ్ కొట్టేసింది,నేను చూసిన మొదటి అందమా ?

Comments

Anonymous said…
good post.. atleast ee kalam cinema la to chuste chaala cool ga undi.. manchi time pass.

Kaani last lo enti mari gaali tisesavu ?

emi ayite ne deeni batti telisindi enti ?
Anonymous said…
Hi Aditya,

Kada baagunnadi. Neee presentation kooda baagunnadi. Waiting for more stories..
rksistu said…
Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.
Anonymous said…
ఆదిత్య, ఇంత బాగా రాయగలిగి ఉండి ఎందుకు రాయడం ఆపేశారు. మీ బ్లాగ్ నాకు ఎంతో నచ్చింది. అభినందనలు.
Sreenivasa Rao Medisetti said…
Guruvugaru...enni sarlu chadivano teliyadhu ee blog...prathi sari na valla kadhu...nijamga pottapattukoni navvuthanu...mi narration ultimate...
రసజ్ఞ said…
ఇదే చూడటం మీ బ్లాగు. చాలా బాగా వ్రాశారు కాని చివ్వరిలో మీరిచ్చిన ట్విస్ట్ నాకెక్కడో తన్నింది. బెజవాడలో ఎక్కుతారన్న వాళ్ళ స్నేహితులు ఎందుకు ఎక్కలేదు అని ఆ అబ్బాయి అమ్మాయిని ఎందుకు అడగలేదు? వాళ్ళు ఎక్కనప్పుడు ఇతనికి సందేహం రాలేదా?బాగా వ్రాస్తున్నారు వ్రాస్తూ ఉండండి!
Chinni said…
nenu chadivEtappudu anukunTune vunnaanu aa ammaayi vaaLla freinds anduku ekkalEdani ..nice post :D
Unknown said…
good experiance blogger,nice post
https://goo.gl/Ag4XhH
plz watch our channel

Popular posts from this blog

ఫొటో

ఎవరు నువ్వు ?