ప్రతిరూపం

                             నిద్రపోతున్న నాకు హఠాత్తుగా మెలకువ వచ్చింది..కళ్ళు తెరిచి చూస్తే అంతా చీకటి.అయినా చీకటిని చూడటం ఏమిటి ? నా భ్రమ కాకపోతే.అంతా నిస్శబ్దం. నా గుండె చప్పుడు నాకే వినిపినిచేటంత నిస్శబ్దం. కొన్ని క్షణాల పాటు నాకు ఏమి అర్థం కాలేదు. నిస్శబ్దాన్ని పారద్రోలటానికి అలరం టైం-పీస్ టక్….టక్….టక్…మని చప్పుడు చేస్తోంది.. టైం ఎంతయ్యిందో సరిగ్గా తెలీదు కాని ప్రపంచం తో తనకి సంబంధం లేదన్నట్టు సెకండ్స్ ముల్లు తన పని తాను చేసుకుపోతోంది.
                కొవ్వొత్తి వెలిగించటానికి మంచం మీద నుండి క్రిందకి దిగుతుండగా చెయ్యి తగిలి టేబుల్ మీద ఉన్న టైం-పీస్ క్రింద పడింది. అంతే. అది చప్పుడు చెయ్యటం మానేసింది. అప్పుడు అర్థమయ్యింది నిస్శబ్ధం ఎంత భయంకరంగా ఉంటుందో. గదిలో ఎక్కడ ఉన్నానో ఎటు వైపు వెళ్ళాలో తోచలేదు. ఆలొచించే శక్తి అస్సలు లేదు. టైం-పీస్ తో పాటే నా మెదడు కూడా పని చెయ్యటం మానేసింది. నా గుండె కూడ కొంత సేపు విశ్రాంతి తీసుకుంతే బాగుండును. ఇంతటి చీకటిని, నిస్శబ్దాన్ని భరించే బాధ తప్పేది. ఊపిరి పీల్చుకుని వదులుతుంటే ఆ శబ్దం నా గుండె లయ తో కలిసి రెసొనేట్ అవుతోంది.. ఎప్పుడు నేను వినని శబ్దం అది.
                            నా కుడి చెయ్యి ముందుకు చాపితే గోడ తగిలింది. గోడని పట్టుకుని ఒక అడుగు ముందుకు వేసాను. కాలికి ఏదో తగిలిన స్పర్శ. మొద్దుబారిన నా మెదడు పని చెయ్యటం మొదలు పెట్టింది.. చచ్చిపోయిన టైం-పీస్ అనుకుంటా. ఇన్నళ్ళు అలసట లేకుండా పనిచేసినందుకు ఇప్పుదు విశ్రాంతి తీసుకుంతోంది. కాలితో ఒక మూలకి తన్నాను. నీ అవసరం నాకింక లేదన్నట్టుగా. ఏ మూలకి చేరిందో అది.. అదే గోడని పట్టుకుని మరో రెండు అడుగులు ముందుకు వేసాను. ఈ సారి చేతికి ఒక వస్తువు తగిలింది. చేతికి తగిలిన ఆ వస్తువు ఫొటో అని దానికి వేలాడుతున్న దండ చెబుతోంది. నా గదిలో ఒకే ఒక ఫొటో ఉంది. అది మా నాన్న గారిది. అప్పుడు అర్ధమయ్యింది నేను గదిలో ఎక్కడ ఉన్నానన్నది. ఎడమ వైపుకి ఒక రెండడుగులు ముందుకు వేసి ఎదురుగా ఉన్న కప్-బోర్డ్ తెరిచాను. కప్-బోర్డ్ లొ ఎదురుగా ఒక అద్దం,పక్కన ఒక దువ్వెన, ఒక అగ్గిపెట్టి, ఒక కొవ్వొత్తి ఉంటాయని తెలుసు.చేత్తో తడిమితే అగ్గి పెట్టి దొరికింది.చాలా తేలికగా ఉంది. అగ్గి పుల్లలు ఉన్నయో లేవో అన్న సందేహం తో ఆడించి చూసాను. మళ్ళి టక్…టక్…టక్ మని చప్పుడు. ఒక్కటే అగ్గి పుల్ల ఉంది. ఉన్న ఒక్క అగ్గిపుల్లతో చీకటిని తరిమేద్దామనుకుని వెలిగించాను. అంతే ఎదురుగా ఒక ఆకారం. అచ్చం నాలాగే. అగ్గి పుల్ల కాంతి మొహం మీద పడి ఎర్రగా ఉంది. భయంకరంగా…అంతే..వెలుగుతున్న అగ్గిపుల్లను ఊది ఆర్పేసాను.
                            అప్పుడు అర్ధమయ్యింది నేను భయపడింది అద్దం లో నా ప్రతి రూపాన్ని చూసి అని.

Comments

Bavundi mee prati roopam :)
cbrao said…
This comment has been removed by a blog administrator.
cbrao said…
మీ రూపాన్ని చూసి మీరే భయ పడ్డారా? నీడను చూసి దడుసుకొన్నట్లు.లేఖిని ఉపయోగించి రాస్తే ఇంకా బాగుండేది.
C. Narayana Rao said…
అరవ హీరో, కీ.శే శివాజే గణేషన్,అలనాడు, తన చిన్నప్పుడు హేరో వేషం కావాలని అడిగినఫ్ఫుడు, నిర్మాత అన్నాడట 'బాబూ! మీ వూళ్ళో మొహం చూసుకొనే అద్దమే లేదా?' అని.
మరీ బడాయి కానీ, మీ ప్రతిబింబం చూసుకొని మీరే భయపడ్డారా!

శైలి బాగుంది.Keep it up!
Anonymous said…
Baavundandee.
cbrao said…
లేఖిని ఉపయోగించారా? తెలుగులో చక్కగా రాయగలిగినందుకు అభినందనలు.
హాయ్ ఆది ! బాగుంది. చాలా బాగుంది. కొంచెం శ్రద్ద తీసుకోవాల్సిన విషయాలు - నిస్సబ్దం కాదు నిశ్శబ్దం. ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. Never mind. keep continue writing. Maintain your own style of writing.
Anonymous said…
I wont tell "Katha" is good but "Kathanam",the way you describe things, the way you run the story is just like a popular writter.Keep it up Aditya :-)
-- Bhargav
Japes said…
Aditya,
You're style is good, i guess you've to venture into different backdrops too. Let me pass on a piece of advice (so called ఉచిత సలహ) that, some very good writers gave me "Try reading different stories, Genres by different writers"

Good luck!
looking forward for your new story !
Hi Adi...,

Really Good........

The way u describe and analyze the situation was very Good....

All The best..

We are expecting more stories...

-- Abhi Devulapalli (Santhosh)
Aditya, photo gurinchi cheppina line chala touching ga undi, resonance ane padanni vadina paddhati chala bagundi. Concept simple e aina, chadavalanipinchindi chivaridaka...baga rasaru!
నచ్చింది అని చెప్పినవారందరికీ ధన్యవాదములు.
Anonymous said…
bagundhandii
asr said…
pratibimbam baagolekapote mumdu moham tuduchukuni tarvaata addaanni tudavaali amduke... mukham manamayite addam society ...imtenaa nii internal concept if so its very good
vijaykumar said…
it's very nice..

Popular posts from this blog

ఫొటో

ఎవరు నువ్వు ?

హతవిధీ !!!