Posts

Showing posts from 2006

మొదటి అందం

రాజమండ్రి రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫారం నుండి హౌరా-చెన్నై మెయిల్ అప్పుడే బయలుదెరింది. భుజాన ఒక బాగ్ తొ ఫరుగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ ఎక్కాను. హడావిడిగా ఎక్కడం వల్ల ఏ కంపార్ట్ మెంట్లోకి ఎక్కానొ తెలీదు. ఆప్పుడే బాత్ రూం లోకి వెల్తున్న ఒక పెద్దాయన్ని అడుగుదామని అనుకున్నాను “ఇది ఎ కంపార్ట్ మెంట్ అని”. ఫరుగెత్తుకుంతు వచ్చి ఎక్కడం వల్ల వచ్చిన ఆయాసం తో గొంతులొ మాట గొంతులొనే ఆగిపొయింది. కంపార్ట్ మెంట్ గేట్ దగ్గరే నిలబడడంతో చల్లగలి నా మొహన్ని తాకి, నుదుటిన పట్టిన చెమటని తుడిచెసింది. ఆమ్మ తన చీర కొంగుతొ తుడిచినట్టుగ.శరీరం చాల ఉల్లాసంగా వుంది. వీచే గాలిని కొంచెం సేపు ఆస్వాదిద్దామని అక్కడే నిలబడ్డాను. ఒక రెందు నిమిషాల తరవాత బాత్ రూం తలుపు చప్పుడవటం తో వెనక్కి తిరిగి చూసాను. పెద్దాయన బయటకి వచ్చారు. తెల్లటి జుబ్బా వేసుకుని ఉన్నారు. వయసు ఒక 50 పైన ఉంటుంది. బ్రాహ్మడనుకుంటా.. జంధ్యంపోగు చెవికి తగిలించాడు .నుదుటిన చిన్న తిలకం బొట్టు వుంది.. ఆప్పుడు అడిగాను ' సర్ ఇది ఏ కంపార్ట్ మెంట్ అని. ఫెద్దాయన నన్ను పైనుండి కిందకి అదోలా చూసి S-2 అని చెప్పారు. ఆప్పుడు అర్ధమయ్యింది నా బెర్త్ కి వెళ్ళాలంటే మధ్యలొ S-...

ప్రతిరూపం

                             నిద్రపోతున్న నాకు హఠాత్తుగా మెలకువ వచ్చింది..కళ్ళు తెరిచి చూస్తే అంతా చీకటి.అయినా చీకటిని చూడటం ఏమిటి ? నా భ్రమ కాకపోతే.అంతా నిస్శబ్దం. నా గుండె చప్పుడు నాకే వినిపినిచేటంత నిస్శబ్దం. కొన్ని క్షణాల పాటు నాకు ఏమి అర్థం కాలేదు. నిస్శబ్దాన్ని పారద్రోలటానికి అలరం టైం-పీస్ టక్….టక్….టక్…మని చప్పుడు చేస్తోంది.. టైం ఎంతయ్యిందో సరిగ్గా తెలీదు కాని ప్రపంచం తో తనకి సంబంధం లేదన్నట్టు సెకండ్స్ ముల్లు తన పని తాను చేసుకుపోతోంది.                 కొవ్వొత్తి వెలిగించటానికి మంచం మీద నుండి క్రిందకి దిగుతుండగా చెయ్యి తగిలి టేబుల్ మీద ఉన్న టైం-పీస్ క్రింద పడింది. అంతే. అది చప్పుడు చెయ్యటం మానేసింది. అప్పుడు అర్థమయ్యింది నిస్శబ్ధం ఎంత భయంకరంగా ఉంటుందో. గదిలో ఎక్కడ ఉన్నానో ఎటు వైపు వెళ్ళాలో తోచలేదు. ఆలొచించే శక్తి అస్సలు లేదు. టైం-పీస్ తో పాటే నా మెదడు కూడా పని చెయ్యటం...

సంతకం...

ఎప్పటి నుండో ఏదో ఒకటి రాయాలని కోరిక.కాని ఇప్పటికింకా అది తీరలేదు. మనసులోని భావాలకు అక్షర రూపం ఇద్దామనుకునేసరికి కెరటంలా మరో ఆలోచన. పోనీ వచ్చిన ఆలోచనకి కొంచం హంగులు దిద్ది ప్రాణం పొద్దామనుకునేసరికి మరో కెరటం. అసలింతకి ఏమి రాయలానుకుంటున్నావని అడిగితే ఏమని చెప్పను ? కథా ? కాదు…కవిత్వమా ? అస్సలు కాదు…ఏంటొ సరిగ్గా నాకే తెలీదు…. నాకే కాదు నా అలోచనలకి కూడ స్థిరం తక్కువనుకుంటా…అందుకే ఒక దాని వెంట మరొకటి ప్రవాహంలా ..చివరికి ఎవరైనా ఏమి రాసావని అదిగితే కలగాపులగమైన నా మెదడులోని అలోచనలకి చిహ్నంగా ఒక తెల్ల కాగితం..కాగితం చివరన ఇలా అందమైన నా సంతకం. --ఆదిత్య

ఎవరు నువ్వు ?

“శైలేష్‌ని ఎందుకు చంపావు ? ” “నేను చంపలేదు .” “మరెవరు చంపారు ?..........................అడిగేది నిన్నే.. మాట్లాడవేం ? …….నాకు తెలుసు నువ్వే చంపావు .” “చంపింది నేను కాదంటే వినవేం ?” “నువ్వు కాకపోతే నీలోని రచయిత. ఇద్దరు ఒక్కటే కదా. ........” “అన్నీ తెలిసి కూడా నన్ను ప్రశ్నిస్తావేం ?” “ఆంటే నువ్వు రచయితవి కాదా ?” “కాదు. నేను రచయితని కాదు.రచన నా వృత్తి అంతకన్నా కాదు .” “వృత్తి కాకపోతే ప్రవృత్తి........పాపం శైలేష్....నిర్దాక్షిణ్యంగా బలయిపోయాడు .” ..“నా గురించి అన్నీ తెలిసి కూడా నన్నెందుకు విసిగిస్తావ్ ? వెళ్ళు అవతలికి. అయిన శైలెష్ నా కథలో సెంట్రల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని చంపితేనే ప్రేక్షకులు ఉత్కంఠగా చదివేది .” “హన్ నాకు తెలుసు..మొన్నటికి మొన్న ….నీ నవలలో హీరోయిన్‌ని అందుకేగా చంపేసావు.? ఆ నవలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు అతితక్కువ కాలంలో ఎక్కువ కాపీలు అమ్ముడుపోయింది ఆ నవలే కదా…అయినా ప్రేక్షకుల్లో ఉత్కంఠ లేపటం కోసం ఒక మనిషిని చంపేస్తావా ?.కీర్తి,డబ్బు సంపాదించటం కోసం ఖూనీలు కూడా చేస్తావనుకోలేదు. రచయిత అంటే తన రచనలతో పదిమందికి ఙ్ఞానాన్ని పంచాలి కాని ఇలా ఖూనీలు చెయ్యకూడ...