Posts

Showing posts from 2011

ఫొటో

హైటెక్ సిటి లొ ఓ హైటెక్ ఆఫీస్ టైం సాయంత్రం 5:30 అయ్యింది. ఇంటికి వెళ్లిపోదాం అని చివరి సారిగా మెయిల్స్ చెక్ చేసుకుని, చాట్ చేస్తున్న ఫ్రెండ్స్ కి కూడా 'బై, సీ యౌ టుమారో' అని చెప్పి, సిస్టం లగౌట్ చేసేసాను హెల్మెట్ తీసుకుని, నా వర్క్ స్పేస్ లోంచి బయటకి వస్తూ, ఇంకా పని చెస్తున్న నా ఫ్రెండ్స్ ని జాలిగా చూసి, 'బై గయ్శ్ అని చెప్పి ఆఫీసు డోర్ వైపు నడిచాను... వడివడిగా వేస్తున్న నా అడుగులు, రిసెప్షన్ దగ్గర్కి చేరుకునేలోపు నాకు తెలియకుండానె స్పీడ్ తగ్గించేసాయి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎల్లో సిగ్నల్ పడినట్టుగా. రిసెప్షన్ దగ్గరకి వచ్చేసరికి రెడ్ సిగ్నల్ పడిపోయింది. ఎంత ప్రయత్నించినా అడుగు ముందుకు పడలేదు. కారణం, రిసెప్షన్ దగ్గర ఒక అమ్మయి. ఎల్లో కలర్ చుడిదార్ లొ వుంది. తన జుట్టు చెంపల మీదకి పడుతుండటం వల్ల మొహం సరిగ్గా కనిపించలేదు. 'ఈ ఎల్లో సిగ్నల్ ఎవరబ్బా ? ఇంటర్వ్యూ కి వచిందా ?' అని డౌటొచ్చింది. ఒక వారం క్రితమే వచ్చిన రెఫెరల్ మెయిలు గుర్తొచ్చి. ఖచ్చితంగా ఈ అమ్మాయి ఇంటర్వ్యూకే వచ్చి వుంటుందనిపించింది. ఇంటర్వ్యూలన్నీ  సాధరణంగా మా మెనేజర్ చేస్తాడు. ఈ అమ్మాయి పేరు కనుక్కుని, నాక...

రూం రెంట్

     ఇంజినీరింగ్ లొ చేరిన మొదటి సంవత్సరం అది.ఇంకా క్లాసులు సరిగ్గా మొదలవలేదు. నేను, రాజు, ప్రసాద్ ముగ్గురమె ఒక రూం లొ వుండేవాళ్లం.మా ప్రసాద్ గాడి ఫ్రెండ్ రవి కూడా మా వీధి లొనే చివరికి వుండేవాడు. వాడి పేరు రవి అని నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. వాడికయితే ఇంకా వాడి పేరు "రవి" అని గుర్తుందని నేననుకోను. ఎందుకంటే, వాడిని అందరూ "బుగ్గలు" అని పిలిచేవారు. ఆ పేరు పెట్టింది కూడా ఎవడో కాదు. మా రాజు గాడు.  ఇంజినీరింగ్ నాలుగు సంవత్సరాలు కూడ వాడిని మా కాలేజి అందరూ అలాగే పిలిచెవారు. దానితొ వాడి పేరు వాడు మర్చిపొయడు. "బుగ్గలు" అని ఫిక్సయిపోయాడు. ఇంజినీరింగ్ అయ్యి పది సంవత్సరాలు అయినా, ఇప్పటికీ వాడిని అందరూ "బుగ్గలు" అనే పిలుస్తారు. వాడికి పెట్టిన ఆ పేరుని బట్టి, వాడి బుగ్గలు ఎలా వుంటాయో మీరే ఊహించుకొండి.      క్లాసులు అవగానే వాడు మా ప్రసాద్ గాడితొ పాటు మా రూం కి వచ్చేవాడు. మాతొ పాటే మెస్ కి, మళ్లి మా రూం కి. వాడి రూం కి వాడు కనీసం పడుక్కోటానికి కూడా వెళ్లేవాడు కాదు. దాంతొ మా ఓనర్ కి డౌటు  వచ్చింది. మా ఓనర్ తొ పాటే మా బుగ్గలోడి ఓనర్ కి కూడా.  ...

కూతురు

లెక్కల మాస్టారికి కూతురు పుట్టింది. పేరు ఎమి పెటాలో తెలియక, 'X' అన్నాడు.  సంగీతం మాస్టారికి కూతురు పుట్టింది. ఎమని పిలవాలో అర్ధం కాక, 'శ్రుతి' అని పిలిచింది  ఫిసిక్స్ మాస్టారికి కూతురు పుడితే, 'మిస్స్ మాగ్నెటిసం' అని సంబరపడిపొయాడు.  తెలుగు మాస్టారికి కూతురు పుడితే, 'సాహితి' అని ముద్దుగా పిలిచాడు. హిష్టరి మాస్టారికి కూడ కూతురు పుట్టింది.  స్వరాజ్యం వచ్చిందనుకున్నాడు .

అప్పుడు, ఇప్పుడు

అప్పుడు: వానలు రావలి వరిచేలు పండాలి మా అమ్మ వండాలి మా కడుపు నిండాలి ఇప్పుడు : Rain  rain go away come again another day.