ఫొటో
హైటెక్ సిటి లొ ఓ హైటెక్ ఆఫీస్ టైం సాయంత్రం 5:30 అయ్యింది. ఇంటికి వెళ్లిపోదాం అని చివరి సారిగా మెయిల్స్ చెక్ చేసుకుని, చాట్ చేస్తున్న ఫ్రెండ్స్ కి కూడా 'బై, సీ యౌ టుమారో' అని చెప్పి, సిస్టం లగౌట్ చేసేసాను హెల్మెట్ తీసుకుని, నా వర్క్ స్పేస్ లోంచి బయటకి వస్తూ, ఇంకా పని చెస్తున్న నా ఫ్రెండ్స్ ని జాలిగా చూసి, 'బై గయ్శ్ అని చెప్పి ఆఫీసు డోర్ వైపు నడిచాను... వడివడిగా వేస్తున్న నా అడుగులు, రిసెప్షన్ దగ్గర్కి చేరుకునేలోపు నాకు తెలియకుండానె స్పీడ్ తగ్గించేసాయి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎల్లో సిగ్నల్ పడినట్టుగా. రిసెప్షన్ దగ్గరకి వచ్చేసరికి రెడ్ సిగ్నల్ పడిపోయింది. ఎంత ప్రయత్నించినా అడుగు ముందుకు పడలేదు. కారణం, రిసెప్షన్ దగ్గర ఒక అమ్మయి. ఎల్లో కలర్ చుడిదార్ లొ వుంది. తన జుట్టు చెంపల మీదకి పడుతుండటం వల్ల మొహం సరిగ్గా కనిపించలేదు. 'ఈ ఎల్లో సిగ్నల్ ఎవరబ్బా ? ఇంటర్వ్యూ కి వచిందా ?' అని డౌటొచ్చింది. ఒక వారం క్రితమే వచ్చిన రెఫెరల్ మెయిలు గుర్తొచ్చి. ఖచ్చితంగా ఈ అమ్మాయి ఇంటర్వ్యూకే వచ్చి వుంటుందనిపించింది. ఇంటర్వ్యూలన్నీ సాధరణంగా మా మెనేజర్ చేస్తాడు. ఈ అమ్మాయి పేరు కనుక్కుని, నాక...