Posts

Showing posts from April, 2010

హతవిధీ !!!

చెన్నై లొ జాబ్ చెసిన రెండున్నర సంవత్సరాల తరవాత మొదటి సారిగా ఇంటెర్నేషనల్ ఫ్లైట్ ఎక్కే అవకాసం వచ్చింది. చెన్నై నుండి ముంబై వరకు జెట్ ఏర్వేస్, ముంబై నుంది జొహన్నెసుబుర్గ్ వరకు సౌత్ ఆఫ్రికన్ ఏర్వేస్ లొ ప్రయాణం. మా కంపనీ నుండి క్లయింట్ కి వర్క్ చెయ్యటం కొసం సౌథ్ ఆఫ్రిక వెళ్లిన రొజులవి. మా కంపనీ నుండి అక్కడకి వెల్లిన వాళ్లకి, హౌస్ అండ్ కార్ ఇస్తుంది మా కంపనీ. బ్యాచిలర్స్ అయితె ఇద్దరు ఒక హౌస్ ని షేర్ చేసుకొవాలి. కార్ కూడా అంతె. ఇద్దరికి కలిపి ఒక కార్ ఇస్తారు. సాధరణంగా ఒకే ప్రాజెక్టు లొ వుండే ఇద్దరు బ్యాచిలర్స్ షేర్ చెసుకొవలి. కాని, కార్ డ్రైవ్ చెయ్యాలంటె, ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఇండియన్ పాస్ పోర్ట్ వుండాలి. సౌత్ అఫ్రికన్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ వున్నా సరె, మా కంపనీ అపాంట్ చేసిన ట్రైనర్ సర్టిఫై చేసిన తరవాతే, కార్ కీస్ మన చేతికి వస్తాయి. ఎంత డ్రైవింగ్ వచ్చినా ఆ ట్రైనర్ సెర్టిఫై చెయ్యకపోతె కంపనీ కార్ లొ మన పెరు మాత్రం వుండదు. కార్ ఇన్సురెన్స్ లొ కూడ మన పేరు అప్పుడె ఆడ్ చెస్తారు. ఆ ట్రైనర్ చాల స్ట్రిక్టు. వాడు చెప్పి వెళ్లాలి, చెప్పులేసుకుని వెళ్లాలి అనే టైపు. ...