Posts

Showing posts from August, 2006

ప్రతిరూపం

                             నిద్రపోతున్న నాకు హఠాత్తుగా మెలకువ వచ్చింది..కళ్ళు తెరిచి చూస్తే అంతా చీకటి.అయినా చీకటిని చూడటం ఏమిటి ? నా భ్రమ కాకపోతే.అంతా నిస్శబ్దం. నా గుండె చప్పుడు నాకే వినిపినిచేటంత నిస్శబ్దం. కొన్ని క్షణాల పాటు నాకు ఏమి అర్థం కాలేదు. నిస్శబ్దాన్ని పారద్రోలటానికి అలరం టైం-పీస్ టక్….టక్….టక్…మని చప్పుడు చేస్తోంది.. టైం ఎంతయ్యిందో సరిగ్గా తెలీదు కాని ప్రపంచం తో తనకి సంబంధం లేదన్నట్టు సెకండ్స్ ముల్లు తన పని తాను చేసుకుపోతోంది.                 కొవ్వొత్తి వెలిగించటానికి మంచం మీద నుండి క్రిందకి దిగుతుండగా చెయ్యి తగిలి టేబుల్ మీద ఉన్న టైం-పీస్ క్రింద పడింది. అంతే. అది చప్పుడు చెయ్యటం మానేసింది. అప్పుడు అర్థమయ్యింది నిస్శబ్ధం ఎంత భయంకరంగా ఉంటుందో. గదిలో ఎక్కడ ఉన్నానో ఎటు వైపు వెళ్ళాలో తోచలేదు. ఆలొచించే శక్తి అస్సలు లేదు. టైం-పీస్ తో పాటే నా మెదడు కూడా పని చెయ్యటం...