స రి గ మ లు
భీమవరంలో ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న రొజులవి.మేము మొత్తం నలుగురుం ఫ్రెండ్స్ ఒక రెండు రూంస్ అద్దెకు తీసుకుని వుండేవాళ్లం. కాశి ,రాజు,ఫ్రసాద్ అండ్ నేను . ప్రసాద్ సివిల్ ఇంజినీరింగ్ మేము ముగ్గురుం ఎలెక్ట్రికల్. నేను, కాశి ఒక ఊరు వాళ్లమే. ప్రసాద్ వాళ్లది రాజమండ్రి. రాజు ది విజయనగరం.నేను కాశి 9th,10th కలిసి చదువుకున్నాము. రాజు,కాశి ఇంటెర్మీడియట్ కలిసి చదువుకున్నారు. అసలే వేసవి కాలం దానికి తోడు పరీక్షలు కూడ దగ్గర పడుతున్నాయి.ఆందుకె తిరుగుళ్ళు తగ్గించి బుద్ధిగా రూంలోనే చదువుకునేవాళ్లం.ఫ్రతి రోజు మధ్యాహ్నం భొజనం చేసి వచ్చి మా ఇంటి ఓనర్స్ దగ్గర ఈనాడు న్యూస్ పేపెర్,ఒక వాటర్ బొటెల్ తెచ్హుకునే వాల్లం. ఓక రోజు మా ఓనర్స్ ని అడిగి ఈనాడు పేపెర్ ప్లస్ ఒక చల్లని వాటెర్ బోటిల్ అడిగి తెచుకున్నాము.రూం లొ నేను,కాశి,రాజు మాత్రమే వున్నాము .ఫ్రసాద్ వాళ్ళ క్లాస్మేట...