Posts

Showing posts from October, 2006

మొదటి అందం

రాజమండ్రి రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫారం నుండి హౌరా-చెన్నై మెయిల్ అప్పుడే బయలుదెరింది. భుజాన ఒక బాగ్ తొ ఫరుగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ ఎక్కాను. హడావిడిగా ఎక్కడం వల్ల ఏ కంపార్ట్ మెంట్లోకి ఎక్కానొ తెలీదు. ఆప్పుడే బాత్ రూం లోకి వెల్తున్న ఒక పెద్దాయన్ని అడుగుదామని అనుకున్నాను “ఇది ఎ కంపార్ట్ మెంట్ అని”. ఫరుగెత్తుకుంతు వచ్చి ఎక్కడం వల్ల వచ్చిన ఆయాసం తో గొంతులొ మాట గొంతులొనే ఆగిపొయింది. కంపార్ట్ మెంట్ గేట్ దగ్గరే నిలబడడంతో చల్లగలి నా మొహన్ని తాకి, నుదుటిన పట్టిన చెమటని తుడిచెసింది. ఆమ్మ తన చీర కొంగుతొ తుడిచినట్టుగ.శరీరం చాల ఉల్లాసంగా వుంది. వీచే గాలిని కొంచెం సేపు ఆస్వాదిద్దామని అక్కడే నిలబడ్డాను. ఒక రెందు నిమిషాల తరవాత బాత్ రూం తలుపు చప్పుడవటం తో వెనక్కి తిరిగి చూసాను. పెద్దాయన బయటకి వచ్చారు. తెల్లటి జుబ్బా వేసుకుని ఉన్నారు. వయసు ఒక 50 పైన ఉంటుంది. బ్రాహ్మడనుకుంటా.. జంధ్యంపోగు చెవికి తగిలించాడు .నుదుటిన చిన్న తిలకం బొట్టు వుంది.. ఆప్పుడు అడిగాను ' సర్ ఇది ఏ కంపార్ట్ మెంట్ అని. ఫెద్దాయన నన్ను పైనుండి కిందకి అదోలా చూసి S-2 అని చెప్పారు. ఆప్పుడు అర్ధమయ్యింది నా బెర్త్ కి వెళ్ళాలంటే మధ్యలొ S-...